సోహైల్ పెద్దన్నయ్య అయితే ఆమె సోదరి కదా?

కొన్ని బంధాలు మీడియా దృష్టిలో వేరుగా ఉండొచ్చు. సోదర సోదరీమణుల బంధాన్ని ఒక్కోసారి మీడియా తప్పుగా చూపించవచ్చు. సల్మనా ఖాన్ సోదరుడు సోహైల్ ఖాన్ తన భార్య నుంచి విడిపోవడానికి ఇలాంటి ఒక రీజన్ ఉందా? అంటే అవుననే టాక్ కూడా ఉంది. సోహైల్ ఖాన్- సీమా ఖాన్ ఏడేళ్లుగా విడివిడిగా జీవించడానికి చాలా కాలం ముందు అందాల నాయిక హుమా ఖురేషితో అతడు ఎఫైర్ సాగించాడని మీడియాలో ప్రచారం సాగింది.

అయితే సోహైల్ - హుమా మంచి స్నేహితులు మాత్రమేనని కొన్ని కథనాలు ఉన్నాయి. సెలబ్రిటీ క్రికెట్ లీగ్ సందర్భంగా వీరిద్దరూ కలుసుకున్నారు. హ్యూమా ని సోహైల్ తన సోదరిగా పరిగణించినా కానీ ఇద్దరి మధ్యా లింకప్ ఉందంటూ కథనాలు వైరల్ అయ్యాయి. అయితే హూమాతో తన అనుబంధం గురించి .. అది సోహైల్ కుటుంబాన్ని ఎలా ప్రభావితం చేస్తుందని ఓ ప్రముఖ మీడియా అడిగినప్పుడు సోహైల్ ఆ వార్తలను ఖండించారు.

ఆ కథనాల్లో నిజం లేదని తమ మధ్య ఏదీ దాచడానికి  లేదని చెప్పాడు. ``అవి పుకార్లు.. అది నిజం కాదని నా కుటుంబ సభ్యులకు తెలుసు. అలాంటప్పుడు ఆ వార్తలు ఎవరినైనా ఎలా ప్రభావితం చేస్తాయి?`` అని సోహైల్ ఖాన్ ఒక వెబ్ సైట్ తో అన్నారు. మీరు చెప్పినట్లుగా ఇది పుకార్లు కాబట్టి చెప్పుకోవడానికి ఏమి ఉంది? అని అతను ప్రశ్నించాడు.

మరోవైపు హ్యూమా ఎవరికి స్నేహితురాలు అంటే? సల్మాన్ ఖాన్ -అర్పితా ఖాన్ స్నేహితురాలు .. సోహైల్ కాదు అని సీమా ఓ సందర్భంలో వెల్లడించింది. సల్మాన్ ఖాన్ పుట్టినరోజున తెల్లవారుజాము వరకు హ్యూమా అక్కడ ఉన్నారనే వార్తలను కొట్టివేస్తూ సల్మాన్ పుట్టినరోజు వేడుకకు తాను రాలేదని సీమా చెప్పిందని ప్రముఖ మీడియా పేర్కొంది.

సీమా స్వయంగా `ది ఫ్యాబులస్ లైవ్స్ ఆఫ్ బాలీవుడ్ వైవ్స్`లో తాను సోహైల్ కి దూరంగా ఉన్నానని బహిరంగంగానే వెల్లడించారు. వారిద్దరూ విడివిడిగా జీవిస్తున్నారు. తమది `సంప్రదాయ వివాహం` కాదని వెల్లడించారు. కొన్నిసార్లు మనం పెద్దయ్యాక సంబంధాలు మెలికలు తిరుగుతాయి. వేర్వేరు దిశల్లోకి వెళ్తాయి. కానీ మేము సంతోషంగా ఉన్నాము.. నా పిల్లలు సంతోషంగా ఉన్నందున నేను దాని గురించి క్షమాపణలు చెప్పను.

సోహైల్ - నేను సాంప్రదాయిక వివాహం చేసుకోలేదు.. కానీ మేము ఒక కుటుంబం. మేము ఒక యూనిట్. మాకు అతను నేను  మా పిల్లలు రోజు చివరిలో ఆనందంగా ఉండడం ముఖ్యం`` అని సీమ వివరించారు. సోహైల్ - సీమా ఖాన జంట ముంబై బాంద్రాలో   ఫ్యామిలీ కోర్ట్ నుంచి బయటకు వచ్చినప్పటి ఫోటోలు అంతర్జాలంలో వైరల్ గా మారాయి.  చాలా కాలం క్రితం సోహైల్ అన్న మాటలు ఇప్పుడు మరోసారి అంతర్జాలంలో వైరల్ గా మారాయి. హూమా తనకు సోదరి అని అతడు వ్యాఖ్యానించడం విశేషం.

× RELATED పేరున్న డైరెక్టర్..పాన్ ఇండియా మూవీ..బజ్ జీరో!
×