నైట్ పార్టీలో సర్కార్ వారి చిలౌట్ ఆ రేంజులో

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన `సర్కార్ వారి పాట` క్రిటిక్స్ విమ‌ర్శ‌ల‌తో సంబంధం లేకుండా భారీ ఓపెనింగుల‌ను సాధిస్తోంది. ఈ సినిమా ఇంటా బ‌య‌టా చ‌క్క‌ని ఓపెనింగుల‌ను సాధించ‌డంతో టీమ్ ఖుషీ అయ్యింది. గురువారం ఈ సినిమా విడుద‌లైంది. తొలి రోజు తొలి నాలుగు రోజుల వ‌సూళ్ల‌కు డోఖా లేద‌ని స‌మాచారం. అయితే సోమ‌వారం నుంచి అస‌లు టెస్ట్ ప్రారంభ‌మ‌వుతుంది.

ఇక ఈ సినిమా ఓపెనింగ్ డే నాన్ ఎస్‌.ఎస్‌.ఆర్ రికార్డ్ ని సాధించింద‌ని టీమ్ ప్ర‌చారం చేస్తోంది. తొలి మూడు రోజులు అద్భుతమైన ప్రదర్శనను కలిగి ఉంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని సక్సెస్ మీట్ ను జ‌రుపుకుంది టీమ్.శుక్రవారం రాత్రి హైదరాబాద్ లోని పోష్ పబ్ లో సర్కార్ వారి పాట నిర్మాతలు టీమ్ కి ఇత‌ర సెలబ్రిటీలకు గ్రాండ్ పార్టీని ఏర్పాటు చేసారు.

ఈ పార్టీలో మ‌హేష్ తో పాటు డైరెక్ట‌ర్ ప‌ర‌శురామ్.. మెహ‌ర్ ర‌మేష్ .. హ‌రీష్ శంక‌ర్.. సుకుమార్ .. ఉప్పెన బుచ్చిబాబు.. మైత్రి నిర్మాత‌లు.. దిల్ రాజు త‌దిత‌రులు ఉన్నారు. అభిమానుల డిమాండ మేర‌కు శుక్రవారం సాయంత్రం నుంచి పలు సెంటర్లలో అదనపు థియేటర్లు ఏర్పాటు చేశార‌ని తెలిసింది. శ‌ని ఆదివారాల వ‌సూళ్ల పైనా అంచ‌నాలున్నాయి.

ఈ సినిమా మొద‌టి రోజు 75కోట్లు వ‌సూలు చేసిందంటూ ఇప్ప‌టికే పోస్ట‌ర్ ని విడుద‌ల చేయ‌గా అది వైర‌ల్ గా మారింది. ఈ సినిమా తొలి రోజు నాన్ ఆర్.ఆర్.ఆర్ రికార్డ్ క్రియేట్ చేసింద‌న్న హంగామా కొన‌సాగుతోంది.

× RELATED కోకా 2.0 : దలేర్ మెహందీలా హనీ సింగులా ఏంటిది కొండా?
×