సిరిని అర్థం చేసుకోవటం అంత కష్టమట.. మళ్లీ ఓపెన్ అయ్యాడు

బిగ్ బాస్ సీజన్లు వస్తుంటాయి.. పోతుంటాయి. కానీ.. అందరికంటే భిన్నంగా కొందరు వేసే ముద్రలు మాత్రం భిన్నంగా ఉంటాయి. వారిని ఒక పట్టాన మర్చిపోవటం సాధ్యం కాదు. ఆ కోవలోకే వస్తుంది నటి కమ్ బిగ్ బాస్ ఫేం సిరి హన్మంత్. అందంగా.. చెదరని చిరునవ్వుతో కనిపించే సిరి.. బిగ్ బాస్ 5లో ఇస్పెషల్ అని చెప్పక తప్పదు. అయితే.. ఈ షోలో షణ్ముఖ్ జశ్వంత్ తో క్లోజ్ గా ఉన్న తీరుతో ఆమెకు బోలెడంత నెగిటివిటీ మూటగట్టుకుంది. మంచి స్నేహితులుగా ఉన్న వేళలో.. బిగ్ బాస్ చూసే వారిలోచాలామంది వీరి క్యూట్ స్నేహానికి ఫిదా కావటమే కాదు.. వారిని చూసేందుకే ఎక్కువ ఆసక్తి చూపించేవారు.

దీనికికారణం లేకపోలేదు. సిరికి బిగ్ బాస్ బయట ప్రియుడు ఉంటే.. షణ్ముఖ్ కు బిగ్ బాస్ హౌస్ బయట ప్రేయసి ఉంది. ఒక విధంగా చెప్పాలంటే వీరిద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నారు. అలాంటి ఇద్దరి మధ్య స్నేహం అంతకంతకూ ముదిరిపోవటం.. హౌస్ లో వారి హగ్గులు ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టటమే కాదు.. సిరికి బోలెడంత నెగిటివిటీని మూటగట్టుకునేలా చేసింది.

అంతేనా.. సిరి తల్లి సైతం హౌస్ లోకి వచ్చినప్పుడు హగ్గుల విషయంలోనూ.. తన కూతురు తీరుపైనా కోపాన్ని ప్రదర్శించటం సంచలనమైంది. షో ముగిసిన తర్వాత కూడా సిరి - షణ్ముఖ్ వ్యక్తిగత జీవితాలకు సంబంధించి చాలానే వార్తలు హడావుడి చేశాయి. ఈ రెండు జంటల మధ్య బ్రేకప్ లు జరిగినట్లుగా వార్తలు వచ్చాయి.

అయితే.. సిరి- శ్రీహాన్ మధ్య రిలేషన్ బ్రేక్ కాలేదన్నట్లుగా వారిద్దరూ కలిసి పార్టీలకు హాజరు కావటంతో ఇలాంటి ప్రచారాలకు పుల్ స్టాప్ పడింది. ఇదిలా ఉంటే తాజాగా యాంకర్ రవి ఒక హోటల్ ప్రమోషన్ లో భాగంగా.. ఒక సరదా కార్యక్రమాన్ని షూట్ చేశారు. మాదాపూర్ లోని ఒక హోటల్లో యాంకర్ రవితో పాటు బిగ్ బాస్ 5 కంటెస్టెంట్లలో పాపులర్ అయిన సిరి.. ప్రియ.. పింకిలతో కలిసి ప్రోగ్రాం చేశాడు. ఇందులో కాజల్ లేకపోవటం గమనార్హం.

ఇక వీడియో విషయానికి వస్తే.. ఇందులో నవ్వులకు కొదవ లేనట్లుగా ప్రోమో కట్ చేశారు. ఐదు నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోను చూసినప్పుడు.. మొత్తం వీడియో మీద ఆసక్తి వ్యక్తం కావటం ఖాయం. ఈ వీడియోలో సిరి గురించి ఆమె ప్రియుడు శ్రీహాన్ చెప్పిన మాటల వీడియో ఆసక్తికరంగా మారింది. అందులోసిరిని అర్థం చేసుకోవటం కష్టమని.. ఆమె ఈ స్థాయికి రావటం వెనుక మొత్తం తన స్వయంకృషే ఉందని స్పష్టం చేశాడు.

సిరిని అర్థం చేసుకోవటానికి చాలా టైం పడుతుందని.. తనకు ఇప్పటికి పడుతూనే ఉందన్న అతడు.. ఏదైనా సాధించాలని సిరి ఫిక్స్ అయితే మాత్రం ఆమె ఎలాంటి కష్టాలు వచ్చినా పట్టించుకోదని పొగిడేశాడు. ఈ వీడియోను చూసినంతనే కాస్తంత ఎమోషనల్ అయ్యేలా ఉంది. ఈ విషయం సిరి ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంది. ప్రొమో విడుదలైన గంటల వ్యవధిలోనే లక్షల వ్యూస్ ను సొంతం చేసుకున్న ఈ వీడియోను ఆదివారం సాయంత్రం యూట్యూబ్ లో విడుదల చేయనున్నారు. సరదాగా ఉన్న ఈ వీడియోను చూస్తున్నంతనే.. బిగ్ బాస్ 5 గురుతుల్లోకి వెళ్లిపోవటం ఖాయం.

 
× RELATED రాజమౌళి టాలీవుడ్ ను ముంచేశాడా..?
×