ట్రెండీ టాక్: కత్రిన 3 నెలల గర్భవతి

అందాల మల్లీశ్వరి కత్రిన కైఫ్ ఇటీవలే తాను వలచిన యువకథానాయకుడు విక్కీ కౌశల్ ని పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఈ జంట అన్యోన్యత అభిమానుల్లో నిరంతరం చర్చకు వస్తోంది. అందుకు సంబంధించిన ఫోటోలు అంతర్జాలంలో వైరల్ గా మారాయి. అయితే ఇంతలోనే కత్రిన మూడు నెలల గర్భవతి అన్న వార్త హాట్ టాపిక్ గా మారింది.

నిజానికి విక్కీ కౌశల్ - కత్రినా కైఫ్ జంట డిసెంబర్ 9 న రాజస్థాన్ లోని ది సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బార్వారాలో వివాహం చేసుకున్నారు. కొద్దిమంది సన్నిహితులు.. కుటుంబ సభ్యులు హాజరైన ఈ పెళ్లికి తక్కువమంది అతిథులు హాజరయ్యారు. అయితే గత కొన్ని రోజులుగా కత్రినా గర్భవతి అని .. త్వరలో ఈ జంట బిడ్డను ఆశిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ పుకార్లను ఎట్టకేలకు విక్కీ ప్రతినిధి ఖండించారు.  ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని అన్నారు. కత్రినా బృందం కూడా ఈ పుకార్లను ఖండించారు. కత్రిన ప్రస్తుతం తన కెరీర్ పై దృష్టి సారిస్తోందని.. తన వైవాహిక జీవితం ప్రారంభ రోజులను ఆనందిస్తోందని కత్రిన ప్రతినిధులు పేర్కొన్నారు.

విక్కీ - కత్రినా జంట వెకేషన్ కోసం ఇటీవల న్యూయార్క్ కి వెళ్లారు. వారు తమ పర్యటనకు సంబంధించిన ఫోటోలను కూడా క్రమం తప్పకుండా సోషల్ మీడియాలో పంచుకున్నారు. కెరీర్ మ్యాటర్ కి వస్తే.. విక్కీ ప్రస్తుతం లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో నటిస్తున్నారు. శశాంక్ ఖైతాన్ - గోవింద నామ్ మేరా .. మేఘనా గుల్జార్  సామ్ మానెక్షా బయోపిక్ కూడా ఉన్నాయి. మరోవైపు కత్రినా వరుస సినిమాలతో క్షణం తీరిక లేనంత బిజీగా ఉంది. ఫోన్ భూత్- మెర్రీ క్రిస్మస్- టైగర్ 3 చిత్రాల్లో కత్రిన నటిస్తోంది. సూపర్ హీరోయిన్ గానూ కత్రిన నటించనుందన్న టాక్ ఉంది.
× RELATED రాజమౌళి టాలీవుడ్ ను ముంచేశాడా..?
×