ఈ విడాకుల వెనక ఆమె కారణం అంటూ!

సల్మాన్ ఖాన్ సోదరుడు సోహైల్ ఖాన్ విడాకులు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సోహైల్ 24ఏళ్ల కాపురం అనంతరం తన భార్య సీమా ఖాన్ నుంచి విడిపోతున్నారు. ఆ మేరకు ముంబై బాంద్రాలో ఫ్యామిలీ కోర్టుకు ఈ జంట హాజరవ్వడంతో బాలీవుడ్ మీడియాలో కథనాలు వైరల్ అయ్యాయి.

ఇదే సమయంలో ఈ జంట విడాకులకు ఫలానా హీరోయిన్ కారణం అంటూ చర్చ నెటిజనుల్లో  వేడెక్కిస్తోంది. సోహైల్ ఖాన్ మరియు సీమా సచ్దేవ్ వివాహం చేసుకున్న 24 సంవత్సరాల తర్వాత విడాకులకు ధరఖాస్తు చేసుకున్నారు...సోహైల్ ఖాన్ - సీమా ఖాన్ విడాకులు తీసుకున్నారు.. అంటూ రకరకాల కథనాలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఈ జంట కోర్టులో స్నేహపూర్వకంగా ఉన్నారు.. ప్రతికూల ప్రకంపనలు ఏవీ లేవు అన్న టాక్ స్ప్రెడ్ అయ్యింది.

అధికారికంగా విడిపోయిన జంట అంటూ కొంత ప్రచారం సాగుతోంది. ఈ జంట 1998లో పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెళ్లి కాకముందే వీరిద్దరూ చెట్టాపట్టాల్ అంటూ షికార్లు చేస్తూ సుడిగాలి రొమాన్స్ చేశారు. కానీ ఇప్పుడిలా వారి విడాకుల వార్త దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అయితే అది ప్రత్యక్షంగా చూశామని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.

తాము కొన్నేళ్లుగా విడివిడిగా జీవిస్తున్నామని.. తమది సంప్రదాయ వివాహం కాదని సీమా స్వయంగా వెల్లడించారు. నటి హుమా ఖురేషీకి లింకప్ చేస్తూ వచ్చిన వార్తలపైనా స్పందించారు. ఇద్దరి మధ్య విభేదాలు పుకార్లు వచ్చాయి. సోహైల్.. హుమా డేటింగ్ పుకార్లలో నిజం లేనప్పటికీ ముంబై టాబ్లాయిడ్ లు వారు కలిసి కనిపించిన కథనాలను ప్రచురించడం కలిసి పార్టీలు చేసుకోవడం వగైరా వార్తలను ప్రచురించాయి.

సోహైల్ -సీమా ఇరువురూ హుమాను విస్మరించినట్లు కూడా వార్తలు వచ్చాయి. దీనిని హ్యూమా కూడా సోషల్ మీడియాలో లాంబాస్ట్ చేయడానికి ఉపయోగించుకున్నారు. ఒక ప్రచురణ ఇద్దరి మధ్య వ్యవహారం గురించి రాసినప్పుడు హ్యూమా సోషల్ మీడియాలో వెబ్ సైట్ ను వాస్తవాన్ని తెలుసుకోవాలని కోరింది. సోహైల్ ఖాన్ తన అన్నయ్య లాంటివాడని కూడా పేర్కొంది.

ఓ ఇంటర్వ్యూలో హ్యూమా ఖురేషీ తన కష్టార్జితానికి దూరంగా ఇతర విషయాలపై శ్రద్ధను చూడటం తనకు బాధ కలిగించిందని అన్నారు. నిజంగా బాధ కలిగించే విషయం ఏమిటంటే.. నా జీవితం గురించి నిజం తెలియకుండా మీడియా ఈ కథనాలను రాసింది. వారు ఎందుకు అలా చేస్తారో నేను మీకు చెప్తాను.. వారు నా వివరణలను పూర్తిగా తీసివేయాలని కోరుకుంటారు కాబట్టి అలా చేస్తారు. కష్టపడి పని చేయడం.. నా జీవితంలో నేను సాధించినదంతా గుర్తుకు రానివ్వరు. ఒక ప్రభావవంతమైన కుటుంబం నుండి వచ్చిన వ్యక్తి లేదా తనను తాను ప్రభావితం చేసే వ్యక్తితో నాకు ఉన్న సాన్నిహిత్యం వల్లనే ఇదంతా జరుగుతోందని వారు మీడియాలో చూపించాలనుకుంటున్నారు. అది అగౌరవం... అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసారు హ్యూమా.
× RELATED ఇద్దరిలో 'పాన్ ఇండియా స్టార్' అనిపించుకునేదెవరు..?
×