బాబు మనసు దోచేశాడు.....టికెట్ ఆయనకే...?

ఆయన ఇప్పటికి మూడు ఎన్నికల నుంచి టికెట్ కోసం గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆయనకు ఎందుకో లక్ కలసిరావడంలేదు. ఈసారి కూడా అది దోబూచులాడుతుందా అన్న అనుమానాలు ఉన్నా చంద్రబాబు టూర్ తో ఫుల్ భరోసా వచ్చేసింది అంటున్నారు. ఆ సీటు భీమిలీ అయితే దక్కేది తనకే అంటున్నారు ఇంచార్జి కోరాడ రాజబాబు. చాలా యంగ్ గా ఉన్నపుడే మండలాధ్యక్షుడిగా పనిచేసిన రాజబాబుకు ఎమ్మెల్యే కోరిక మాత్రం ఎప్పటికీ తీరడంలేదు.

ఆయన 2009 ఎన్నికల్లోనే టీడీపీ టికెట్ కోసం ట్రై చేసి రాకపోవడంతో  ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఏకంగా పాతిక వేల దాకా ఓట్లు సంపాదించారు.  ఇక 2014 నాటికి వైసీపీలోకి వెళ్లారు కానీ టికెట్ ఇవ్వలేదు దాంతో తిరిగి టీడీపీలో చేరిపోయారు. నాటి అభ్యర్ధి గంటా శ్రీనివాసరావు విజయానికి కృషి  చేశారు. ఇక 2019లో టికెట్ గ్యారంటీ అనుకుంటున్న వేళ మాజీ ఎంపీ సబ్బం హరి రూపంలో చెక్ పడింది.

దీంతో 2024 లో టికెట్ తనదే అని ఆయన ధీమాగా ఉన్నారు. కానీ ఇదే టికెట్ మీద గంటా కన్ను ఉంది అంటున్నారు. అలాగే టీడీపీలో పలువురు సీనియర్లు కూడా కర్చీఫ్ వేశారు. ఇక మాజీ ఎమ్మెల్యే కర్రి సీతారామ్ సైతం తన వంతుగా ట్రై చేస్తున్నారు. ఈ అయోమయం ఇలా ఉండగానే ఈ మధ్య చంద్రబాబు బాదుడే బాదుడు ప్రోగ్రాం కి భీమిలీ వచ్చారు. బాబు టూర్ మొత్తం కోరాడ జాగ్రత్తగా చూసుకున్నారు.

అంతా ఒంటిచేత్తో కధ నడిపారు. జనాలు బాగా వచ్చారు పార్టీ ఎటూ పటిష్టంగా ఉంది.దాంతో పాటు రాజబాబు ప్లానింగ్ తో బాబు టూర్ సూపర్ హిట్ చేశారు.  అలా ఆయన  బాబు మానసు దోచుకున్నారు అని కోరాడ  వర్గం సంతోషిస్తోంది. ఈసారి రాజబాబుకే టికెట్ అని అపుడే ప్రచారం చేసుకుంటున్నారు. సొంతంగా పాతిక వేల ఓట్ల దాకా బలం ఉన్న రాజబాబుకు పార్టీ బలం తోడు అయితే కచ్చితంగా బ్రహ్మాండమైన మెజారిటీని తెస్తారు అని అంటున్నారు. అయితే చంద్రబాబు వరకూ ఓకే అయినా ఈ సీటు మీద జనసేన కూడా కన్ను వేసింది. చివరి నిముషంలో పొత్తులలో భాగంగా సీటు ఆ పార్టీకి ఇస్తే మాత్రం రాజబాబుకు మరో మారు నిరాశ తప్పదు. చూడాలి మరి ఏం జరుగుతుందో.
× RELATED జగన్ 65 సీట్లు మార్చోబోతున్నారా...?
×