తమిళ స్టార్ తెలుగు సినిమాకు ముహూర్తం ఫిక్స్

మన హీరోలు పాన్ ఇండియా స్థాయి చిత్రాలపై ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే. అందులోనూ ఉత్తరాది మార్కెట్ ని టార్గెట్ చేస్తూ మన వాళ్లు సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే ఇదే సమయంలో కోలీవుడ్ స్టార్స్ మన టాలీవుడ్ పై కన్నేయడం ఆసక్తికరంగా మారింది. తమిళ స్టార్ ధనుష్ తెలుగులో తొలి సారి సినిమా చేస్తున్నారు. వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తున్న ఈమూవీనితెలుగులో `సార్` తమిళంలో `వాతి` పేరుతో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ ఇటీవలే మొదలైంది.

ఇదిలా వుంటే మరో తమిళ స్టార్ తెలుగులో భారీ సినిమా చేయడానికి ఆసక్తిని చూపిస్తున్నాడు. ఇళయదళపతి విజయ్ తెలుగులో స్ట్రెయిట్ మూవీ చేయడానికి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. వంశీ పైడిపల్లి ఈ మూవీని డైరెక్ట్ చేయబోతున్నారు. అత్యంత భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీగా తెరపైకి రానున్న ఈ మూవీని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించబోతున్నారు. ఈ ప్రాజెక్ట్ ప్రకటించి చాలా రోజులవుతున్నా ఇంత వరకు దీనికి సంబంధించిన అప్ డేట్ మాత్రం ఇంత వరకు రాలేదు.

తాజాగా ఓ ఆసక్తికరమైన వార్త బయటికి వచ్చేసింది. ప్రస్తుతం విజయ్ `బీస్ట్` చిత్రంలో నటిస్తున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ మూవీ చిత్రీకరణ ఇటీవలే పూర్తయింది. త్వరలో ఈ మూవీని రిలీజ్చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. తన వర్క్ పూర్తి కావడంతో హీరో విజయ్ తన దృష్టిని తెలుగు ప్రాజెక్ట్ వైపు మళ్లించాడట. వచ్చే నెల డబ్బింగ్ వర్క్ కూడా పూర్తి చేయబోతున్న విజయ్ ఆ తరువాత వంశీ పైడిపల్లితో చేయబోతున్న తెలుగు ప్రాజెక్ట్ కోసం తన డేట్స్ ని కేటాయించబోతున్నాడని తెలిసింది.

తెలుగు తమిళ భాషల్లో ఏక కాలంలో రూపొందనున్న ఈ ద్వి భాష చిత్రంగా తెరకెక్కబోతోంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసిన వంశీ పైడిపల్లి ఈ మూవీని త్వరలోనే పట్టాలెక్కించాలని ప్లాన్ చేస్తున్నారట. నిర్మాత దిల్ రాజు కూడా ఈ మూవీని త్వరగా ప్రారంభించాలని ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. కాగా ఈ భారీ ప్రాజెక్ట్ ని వచ్చే నెల లాంఛనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభించి మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టాలని నిర్ణయించినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.

విజయ్ కూడా సిద్ధంగా వుండటంతో దిల్ రాజు ఈ నిర్ణయం తీసుకున్నట్టుడా తెలుస్తోంది. బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ ఇందులో హీరో విజయ్ కి జోడీగా కనిపించబోతోంది. త్వరలోనే ఆ హీరోయిన్ ఎవరన్నది దిల్ రాజు ప్రకటించే అవకాశం వుందని చెబుతున్నారు. ఇక ఈ చిత్రాన్ని సున్నితమైన భావోద్వేగాల సమాహారంగా సాగే ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కించబోతున్నారని తెలిసింది.
× RELATED మెగా అల్లు కాంపౌండ్ లలో ఏం జరుగుతోంది?
×