ప్రభాస్ కోసం స్పెషల్ ఈవెంట్ ప్లాన్ చేశారా?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన చిత్రం థియేటర్లలో సందడి చేసి దాదాపు మూడేళ్లవుతోంది. దీంతో ఆయన సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్లలోకి వచ్చేస్తుందా? అని ప్రభాస్ అభిమానులతో పాటు సగటు సినీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరీ ముఖ్యంగా ప్రభాస్ అభిమానులు మాత్రం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

ఈ నేపథ్యంలో ప్రభాస్ నటించిన తాజా చిత్రం `రాధేశ్యామ్` పై భారీ అంచనాలు నెకొన్నాయి. 18 ఏళ్ల పాటు ఈ చిత్ర కథ కోసంరీసెర్చ్ చేశామని దేశంలో వున్న ప్రముఖ రచయితలు ఈ మూవీ స్టోరీ కోసం పని చేశారని ఈ మూవీ తీయడానికే మూడేళ్లు పట్టిందని దర్శకుడు రాధా కృష్ణ కుమార్ చెప్పడంతో `రాధేశ్యామ్` ప్రాజెక్ట్ టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారింది.  

అంతే కాకుండా ప్రభాస్ నటించిన `సాహో` మూవీ తరువాత వస్తున్న భారీ చిత్రం కావడంతో ఈ సినిమాని చాలా వరకు ప్రత్యేకంగా చూస్తున్నారు. ఇదిలా వుంటే ఈ మూవీ రిలీజ్ పై గత కొన్ని రోజులగా వస్తున్న పుకార్లకు చెక్ పెడుతూ మేకర్స్ రెండు రిలీజ్ డేట్ లని ప్రకటించబోతున్నారు. మార్చి ఫస్ట్ ఫ్రైడే లేదా సెకండ్ ఫ్రైడే కానీ లేదా ఏప్రిల్ నెలలో ఫస్ట్ ఫ్రైడే లేదా సెకండ్ ఫ్రైడే కానీ ఈ మూవీని రిలీజ్ చేయాలని మేకర్స్ పక్కా ప్లాన్ తో రెడీ అవుతున్నారు.

ఈ నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం టాలీవుడ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. ఈ మూవీ ప్రమోషన్స్ కోసం త్వరలోనే స్పెషల్ ఈవెంట్ ని నిర్వహించాలని బావిస్తున్నారట. ఇటీవల జనవరి 14న ముందు రిలీజ్ అని ప్రకటించిన మేకర్స్ దీని కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ ప్రీరిలీజ్ ఈవెంట్ ని నిర్వహించిన విషయం తెలిసిందే. దీనికి యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి హోస్ట్గా వ్యవహరించి ఈ వెంట్ ని బ్లాక్ బస్టర్ హిట్ చేశాడు.

అయితే రిలీజ్ వాయిదా పడటంతో మరోసారి ఈ మూవీ ప్రమోషన్స్ ని భారీ స్థాయిలో ప్రారంభించాలని అందుకు ముందుగా ఓ స్పెషల్ ఈ వెంట్ ని నిర్వహించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. అయితే ఇది ఎంత వరకు నిజమన్నది మాత్రం క్లారిటీ లేదు. ఫిల్మ్ వర్గాల్లో మాత్రం ఇది వైరల్ అవుతోంది. మార్చిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తే ఫిబ్రవరి లో `రాధేశ్యామ్` ప్రమోషన్స్ మొదలుపెట్టాల్సి వుంటుంది. ఆ కారణంగానే మేకర్స్ ప్రచార కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలని ఆలోచిస్తున్నారట.
× RELATED మెగా అల్లు కాంపౌండ్ లలో ఏం జరుగుతోంది?
×