కోర్టు దెబ్బకు ప్రజా సేవ చేయడానికి రెడీ అయిన జూహీ చావ్లా

బాలీవుడ్ నటి జూహీ చావ్లా నోటిదురుసుకు కోర్టు గట్టిగానే షాకిచ్చింది. ఆమె గతంలో  5జీ నెట్ వర్క్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. దీనిపై కేసులు నమోదై కోర్టుకెక్కింది. ఈ కేసు గురువారం కొలిక్కి వచ్చింది.

దేశంలో ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా 5జీ వైర్ లెస్ నెట్ వర్క్ లను ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ జూహీ చావ్లా.. పర్యావరణ వేత్తలతో కలిసి గత ఏడాది ఢిల్లీ హైకోర్టులో కేసు దాఖలు చేసింది. దీనిపై పలు మార్లు విచారించిన ధర్మాసనం.. జూహీ చావ్లా పై ఆగ్రహం వ్యక్తం చేసింది.

5జీతో ప్రజలు జంతువులకు ముప్పు ఉందంటూ జూహీ చావ్లా చేసే ప్రచారం కేవలం పబ్లిసిటీ కోసమేనంటూ కోర్టు పేర్కొంది. అంతేకాకుండా ఆమెపై 20 లక్షల జరిమానా సైతం విధించిన సంగతి తెలిసిందే. జరిమానా తగ్గించాలన్న వినతిపై కోర్టు స్పందించింది. ఏదైనా ప్రజా ప్రయోజనం కోసం పనిచేస్తే కోర్టుకు కట్టాల్సిన జరిమానాను రూ.20 లక్షల నుంచి రూ.2 లక్షలకు తగ్గిస్తామని ఢిల్లీ హైకోర్టు మంగళవారం పేర్కొంది.

ఈక్రమంలోనే జూహీ చావ్లా ఢిల్లీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ తో కలిసి పనిచేయడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చింది. సమాజంలోని అట్టడుగు వర్గాలకు సాధికారత కల్పించే కార్యక్రమాలలో నటిస్తానని గురువారం ధర్మాసనానికి తెలిపింది. దీంతో ప్రచారం కోసం దావా వేసినట్లు నటి జూహీ చావ్లాపై కోర్టు చేసిన వ్యాఖ్యలను ఢిల్లీ హైకోర్టు తొలగించింది.

జూహీ చావ్లా ప్రజా ప్రయోజనం కోసం పనిచేస్తానని కోర్టుకు తెలుపడంతో ధర్మాసనం జూహీ చావ్లాపై విధించిన జరిమాన రూ.20లక్షల నుంచి రూ.2 లక్షలకు తగ్గించింది. ఆమె 5జీ సమస్యనుసాధారణంగా అర్థం చేసుకోలేదని కోర్టు అభిప్రాయపడింది. సీనియర్ న్యాయవాది సల్మాన్ ఖుర్షీద్ సూచనలను తీసుకున్న తర్వాత జూహీ చావ్లా ఈ నిర్ణయం తీసుకుంది.

కోర్టు జరిమానా శిక్ష నుంచి తప్పించుకోవడానికి ప్రజా సేవ చేయాల్సిన పరిస్థితి పాపం జూహీ చావ్లాకు ఏర్పడిందని.. లేకుంటే ఆమె చేసేది కాదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
× RELATED రాజమౌళి టాలీవుడ్ ను ముంచేశాడా..?
×