చరణ్ - శంకర్ ల నుంచి క్రేజీ అప్ డేట్

మెగా పవర్ స్టార్ లైనప్ మామూలుగా లేదు. జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం`ఆర్ ఆర్ ఆర్`. ఇందులో తొలిసారి యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి రామ్ చరణ్ నటించారు. భారీ మల్టీ స్టారర్ గా దేవవ్యాప్తంగా క్రేజ్ ని సొంతం చేసుకున్న ఈమూవీ భారతీయ సినీ తెరపై వండర్స్ ని క్రియేట్ చేస్తుందని దేశ వ్యాప్తంగా వున్న సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ మూవీ అనివార్య కారణాల వల్ల వాయిదాపడి మార్చి లేదా ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఇప్పటికే మేకర్స్ రెండు రిలీజ్ డేట్ లని కూడా ప్రకటించారు. ఇదిలా వుంటే ఈ మూవీ తరువాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరో క్రేజీ ప్రాజెక్ట్ లో నటిస్తున్న విషయం తెలిసిందే.

దిగ్రేట్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సమకాలీన రాజకీయ అంశాల నేపథ్యంలో సెటైరికల్ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ప్రాజెక్ట్ ప్రకటించడమే ఆలస్యం వెంటనే పూజా కార్యక్రమాలతో సినిమాని ప్రారంభించేశారు కూడా.

ప్రస్తుతం ఈ మూవీ కోసం చెన్నైలో కీలక సెట్ లని నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ తదుపరి షెడ్యూల్ ప్రారంభం కాబోతోంది. కాన్సెప్ట్ పోస్టర్ తో ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేసిన మేకర్స్ ఈ మూవీ విషయంలో ప్రతీ విషయాన్ని చాలా ప్రత్యేకంగా తీసుకుంటున్నారట. దిల్ రాజు బ్యానర్ కు 50వ సినిమా కావడం అంతే కాకుండా హీరో రామ్ చరణ్ దర్శకుడు శంకర్ లకు ఇది 15వ సినిమా కావడంతో  ఈ ప్రాజెక్ట్ ని మరింత ప్రత్యేకంగా చాలా ప్రత్యేకతలతో తెరపైకి తీసుకురానున్నారట.

ఇదిలా వుండగా ఈ చిత్రానికి సంబంధించిన మరో ఆసక్తికరమైన వార్త ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ ని త్వరలోనే రిలీజ్ చేయాలని దిల్ రాజు ప్లాన్ చేస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. అంతే కాకుంగా ఫస్ట్ లుక్ రిలీజ్ కు డేట్ కూడా ఫిక్స్ చేసినట్టుగా చెబుతున్నారు. మార్చి 27న మెగా పవర్ స్టార్ పుట్టిన రోజు వేడుకలు జరగబోతున్నాయి. ఈ సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట.

ఇక `గుడ్లక్ సఖి` ప్రీరిలీజ్ ఈవెంట్ లో నిర్మాత దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. రానున్న 12 నెలల్లో రామ్ చరణ్ నుంచి బ్యాక్ టు బ్యాక్ మూడు హైలెవెల్ యాక్షన్ ప్యాక్డ్ మూవీస్ రాబోతున్నాయని అవి ఆర్ ఆర్ ఆర్ ఆచార్య ఆర్ సి 15 అని..

అభిమానులు రెడీగా వుండాలని స్పష్టం చేశారు. ఈ సినిమాలతో రామ్ చరణ్ ట్రీట్ ఇవ్వబోతున్నారని దిల్ రాజు తెలిపారు. దీంతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. శంకర్ - చరణ్ ల చిత్రానికి తమన్ సంగీతం అందిస్తుండగా హీరోయిన్ గా బాలీవుడ్ క్రేజీ లేడీ కియారా అద్వానీ నటిస్తోంది.

× RELATED అంతా ఆయన్ను కోరుతున్నారు.. మహేష్ మాత్రం నో చెప్పాడట!
×