ప్రమాదం జరిగితే ప్రాణాలు అనంత 'వాయువుల్లోనే'

విమాన ప్రయాణమైనా.. హెలికాప్టర్ ప్రయాణమైనా.. వెళ్లేందుకు వచ్చేందుకు ఎంత సౌఖ్యమో.. ఏదైనా అనూహ్య ఘటన జరిగితే అంత దారుణము. సాధారణ ప్రజలే కాదు.. ఎందరో ప్రముఖులు విమాన హెలికాప్టర్ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటివారిలో కొందరి మరణాలు చరిత్ర గతినే మార్చాయంటే ఆశ్చర్యం లేదు. ప్రపంచవ్యాప్తంగా మరణించిన ప్రముఖులు నేతలు కాకుండా మన దేశంలో చోటుచేసుకున్న విమాన హెలికాప్టర్ ప్రమాదాలను గమనిస్తే..

ఉమ్మడి ఏపీని కదిలించిన వైఎస్ మరణం..

తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే హెలికాప్టర్ మరణాల్లో ముందుగా చెప్పుకోవాల్సింది ఉమ్మడి ఏపీ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి దుర్మరణం. 2009 ఎన్నికల్లో గట్టి పోటీని తట్టుకుని విజయం సాధించిన వైఎస్ గొప్ప నేతగా ఎదిగారు. కానీ రెండోసారి సీఎం అయిన వంద రోజులకే దుర్మరణం పాలయ్యారు. 2009 సెప్టెంబరు 2న చిత్తూరు జిల్లాలో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తూ హెలికాప్టర్ కూలిపోవడంతో చనిపోయారు.

జీఎంసీ బాలయోగి..

లోక్ సభ స్పీకర్ స్థాయికి ఎదిగిన తెలుగు బిడ్డ జీఎంసీ బాలయోగి 2002 ఫిబ్రవరి లో హెలికాప్టర్ కుప్పకూలడంతో ప్రాణాలు కోల్పోయారు. తూర్పు గోదావరి జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన తిరిగి వెళ్తూ ప్రమాదానికి గురయ్యారు.

మాధవరావు సింధియా

ప్రస్తుత కేంద్ర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య తండ్రి మాధవరావు సింధియా. గ్వాలియర్ రాజ కుటుంబానికి చెందినవారు. మాజీ ప్రధానులు ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీకి అత్యంత సన్నిహితులు. 2001 సెప్టెంబరు 30న విమానం కూలిన ఘటనలో చనిపోయారు.

దోర్జీ ఖండూ

అరుణాచల్ సీఎంగా ఉన్న దోర్జీ ఖండూ 2011 ఏప్రిల్ 30న జరిగిన హెలికాప్టర్ దుర్ఘటనలో చనిపోయారు. అప్పటికి వైఎస్ చనిపోయి రెండేళ్లు కూడా కాని నేపథ్యంలో దోర్జీ దుర్మరణం చర్చనీయాంశమైంది.

సంజయ్ గాంధీ

కాంగ్రెస్ యువ నేత మాజీ (అప్పటి) ప్రధాని ఇందిరాగాంధీ కుమారుడు చిన్న సంజయ్ గాంధీ 1980 జూన్ 23న ఢిల్లీలోని సఫ్దర్ జంగ్ విమానాశ్రయంలో జరిగిన విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. స్వతహాగా సంజయ్ కమర్షియల్ పైలట్. విమానాలతో ఆయన విన్యాసాలు చేసేవారని చెప్పుకొంటారు. కాంగ్రెస్ లో పెద్ద నేతగా ఎదుగుతున్న క్రమంలో సంజయ్ ప్రాణాలు కోల్పోవడం నాడు పెద్ద సంచలనమైంది.

ఓపీ జిందాల్ సౌందర్య

హరియాణకు చెందిన మంత్రి ఓపీ జిందాల్ 2005 మార్చిలో తెలుగుతో పాటు పలు భాషల్లో అగ్ర హీరోయిన్ గా ఉన్న సౌందర్య 2004  ఎన్నికల సమయంలో హెలికాప్టర్ కూలి చనిపోయారు.

నేతాజీ మరణం నేటికీ రహస్యమే

వీరందరికంటే.. ముందుగా దేశానికి స్వాతంత్ర్యానికి పూర్వమే నేతాజీ సుభాష్ చంద్రబోస్ విమాన ప్రమాదానికి గురయ్యారు. 1945 ఆగస్టు 18న జరిగిన ఈ ఘటన నేటికీ రహస్యమే. నేతాజీ బతికే ఉన్నారని ఇప్పటికీ నమ్మేవారున్నారు.
× RELATED జీతాలు పింఛన్ల బిల్లులు ప్రాసెస్ చేయండి: ఏపీ సర్కార్ హెచ్చరిక
×