వీడియో : 'ఆచార్య' అంచనాలు పెంచేసిన సిద్దా

మెగాస్టార్ చిరంజీవి.. కొరటాల శివల కాంబోలో రూపొందిన ఆచార్య సినిమా కోసం మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో చరణ్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. మొదట సిద్దా పాత్రను గెస్ట్ రోల్ అన్నట్లుగా రాసుకున్న దర్శకుడు కొరటాల శివ పాత్ర నచ్చి చరణ్ చేసేందుకు ఓకే చెప్పడంతో పాత్రను పెంచడం జరిగింది. దాంతో ఆచార్య కాస్త ఫ్యామిలీ మల్టీ స్టారర్ గా మారి పోయింది. గత ఏడాది ఆగస్టు లో వస్తుందని ఆశ పడ్డ ఆచార్య కరోనా వల్ల వాయిదాల మీద వాయిదాలు పడి ఎట్టకేలకు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటే వచ్చింది. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న సమయంలో పబ్లిసిటీ షురూ చేసే ఉద్దేశ్యంతో సిద్దా టీజర్ ను రివీల్ చేశారు.

ఇప్పటికే ఆచార్య లో సిద్దా గా చరణ్ ఎలి కనిపించబోతున్నాడు.. ఆయన పాత్ర ఏంటీ అనేది ఒక క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు మరింత క్లారిటీ వచ్చేలా టీజర్ ను విడుదల చేశారు. ధర్మస్థలి కి చెందిన వ్యక్తిగా సిద్దా కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ధర్మస్థలిని కాపాడుకునే వ్యక్తిగా రామ్ చరణ్ సిద్ద పాత్రలో కనిపించబోతున్నాడని టీజర్ చూస్తుంటే క్లీయర్ గా అర్థం అవుతోంది. వింటేజ్ బ్యాక్ డ్రాప్ తో పాటు ఆకట్టుకునే ఒక మంచి స్క్రీన్ ప్లే తో ఈ సినిమా రూపొందినట్లుగా మేకర్స్ చెబుతున్నారు. రామ్ చరణ్ విజువల్స్ చాలా అద్బుతంగా ఉన్నాయంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ సినిమా లో అల్లూరి పాత్రకు ఏమాత్రం తగ్గకుండా సిద్ద పాత్ర విజువల్స్ ఉన్నాయంటూ సోషల్ మీడియాలో అభిమానులు చర్చించుకుంటున్నారు.

ఆచార్య సినిమా లో చిరంజీవి తో పాటు ఏమాత్రం తగ్గకుండా చరణ్ పాత్ర కూడా ఉండబోతుంది. సోనూసూద్ తో చేసిన ఒక ఫైట్ లో రామ్ చరణ్ నటన ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేస్తారని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. వారు చెప్పినట్లుగానే టీజర్ లో సోనూసూద్ ను తిప్పి కొట్టే షాట్ అద్బుతంగా ఉందంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఆచార్య సినిమా స్థాయిని సిద్ది అమాంతం పెంచేసి ఫిబ్రవరి 4 ఎప్పుడు వస్తుందా అంటూ ఆసక్తిగా ఎదురు చూసేలా చేసింది. నిమిసం ఉన్న టీజర్ లో రామ్ చరణ్ లోని ఎన్నో యాంగిల్స్ ను చూపించారు. హీరోయిన్ పూజా హెగ్డేతో రొమాన్స్.. సోనూసూద్ తో ఫైటింగ్.. పిల్లలతో ఆటలు ఎన్నో చూపించారు. చివరి షాట్ ఇక అభిమానులకు పూనకాలు తెప్పించాయి. చిరుతపులి మరియు చిరుత పిల్ల వాగుకు అటు వైపు ఉండగా మరో వైపు చరణ్ మరియు చిరంజీవి ని చూపించిన షాట్ అదిరి పోయింది. అభిమానులు ఏదైతే కోరుకుంటున్నారో అదే దొరకబోతుంది అంటూ ఈ టీజర్ ను చూస్తుంటే అర్థం అవుతోంది.

× RELATED నిద్ర పట్టడం లేదా పుష్ప?
×