హైదరాబాద్ లో రేవ్ పార్టీ: 44మంది హోమో సెక్స్ వల్స్

రేవ్ పార్టీలకు అడ్డాగా హైదరాబాద్ మారిపోతోంది. ముఖ్యంగా పట్టణ శివారులోని ఫాంహౌస్ లు నిర్మానుష్య ప్రాంతాల్లో ఈ పార్టీలు జోరుగా సాగుతున్నాయి. పోలీసులు ఎంత పకడ్బందీగా చర్యలు తీసుకున్నా సరే ఎక్కడో ఒక చోట అవి వెలుగుచూస్తున్నాయి.

తాజాగా హైదరాబాద్ కూకట్ పల్లిలో వీకెండ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. వివేకానందనగర్ లోని ఓ అపార్ట్ మెంట్ పై పోలీసులు దాడి చేసి 44 మంది యువకులతోపాటు ఇద్దరు హిజ్రాలను అదుపులోకి తీసుకున్నారు.

పార్టీ జరిగిన అపార్ట్ మెంట్ లో మద్యం బాటిళ్లతోపాటు హుక్కా బాటిళ్లు కండోమ్ ప్యాకెట్లు ఉన్నాయి. ఘటనలో పట్టుబడినవారంతా హోమో సెక్స్ వల్స్ గా పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది.

పార్టీని ఇమ్రాన్ దయాల్ అనే ఇద్దరు నిర్వహించారని తేలడంతో పోలీసులు వారిపై కేసులు నమోదు చేశారు. అందరినీ అదుపులోకి తీసుకొని విచారణ నిమిత్తం వారిని కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ యువకులు అంతా ఓ బ్యాచ్ గా ఏర్పడి తరచూ వీకెండ్ లో రేవ్ పార్టీలు నిర్వహిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. పార్టీ పేరుతో న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారని స్థానికుల నుంచి ఫిర్యాదు అందడంతో పోలీసులు దాడులు నిర్వహించారు.
× RELATED తిరుపతికి బాలాజీ పేరేంటి స్వామీ... ?
×