ఇకపై జై బాలయ్య మరింత పాపులర్

నందమూరి అభిమానులు ఏ కార్యక్రమం జరిగినా.. ఏ సందర్బంలో అయినా జై బాలయ్య అంటూ నినాదాలు ఇవ్వడం మనం చూస్తూనే ఉంటాం. పెద్ద ఎత్తున అభిమానులు జై బాలయ్య అంటూ ఇప్పటికే ఆ పదంను చాలా పాపులర్ చేశారు. ఇప్పుడు జై బాలయ్య పదంను మరింత పాపులర్ అయ్యేలా అఖండ సినిమాలో జై బాలయ్య పాటను పెట్టారు. గీతా మాధురి పాడిన ఆ పాట ప్రస్తుతం నెట్టింట షేక్ చేస్తోంది. అభిమానులు మరియు శ్రోతలు జై బాలయ్యను ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. థమన్‌ మరోసారి జనాల నాడిని పట్టాడు అంటూ ఈ పాటకు అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. బాలయ్యకు ఒక బెస్ట్‌ మాస్ బీట్ ను ఇచ్చినందుకు కృతజ్ఞతలు అంటూ నందమూరి అభిమానులు థమన్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

జై బాలయ్య పాటలో ప్రగ్యా జైస్వాల్‌ మాస్ స్టెప్పులు మరియు హాట్‌ క్యూట్‌ లుక్స్‌ తో ఆమె ఆకట్టుకునే విధంగా ఉంది. జై బాలయ్య పాట చిత్రీకరణ కూడా చాలా బాగుందంటూ విజువల్స్ చూసిన ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లు బయట మాత్రమే వినిపించిన జై బాలయ్య ఇప్పుడు బాలకృష్ణ సినిమాలో జై బాలయ్య అంటూ వినిపిస్తున్న నేపథ్యంలో అభిమానులు సర్‌ ప్రైజ్ అవుతున్నారు. ప్రతి ఒక్క అభిమాని కూడా జై బాలయ్య అంటూ ఇక ముందు ఈ పాటను పదే పదే వింటారేమో చూడాలి. ఈ పాట విడుదల అయిన కొన్ని గంటల్లోనే 3 మిలియన్ ల వ్యూస్ ను దక్కించుకోవడంతో పాటు లక్షకు పైగా లైక్స్ ను దక్కించుకుంది. బాలయ్య కెరీర్‌ లో ఈ నెంబర్స్ చాలా అరుదుగా వస్తూ ఉంటాయి.

అఖండ సినిమాలో వచ్చే ఈ పాటలో బాలయ్య మాస్‌ స్టెప్పులు అభిమానులకు పూనకాలు తెప్పిస్తాయని అంటున్నారు. బాలయ్యకు మాత్రమే సాధ్యం అయ్యే కొన్ని సిగ్నేచర్‌ స్టెప్స్ ఉన్నాయి. వాటిని అభిమానులు ఈమద్య మిస్ అవుతున్నారు. జై బాలయ్య పాటలో వాటిని చూస్తామని వారు ఆశిస్తున్నారు. ఖచ్చితంగా అఖండ సినిమా బాలయ్య అభిమానులతో పాటు ప్రతి ఒక్క సినీ ప్రేమికుడిని కూడా మెప్పించే విధంగా ఉంటుందనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. బాలకృష్ణ మరియు బోయపాటి కాంబోలో రాబోతున్న ఈ సినిమా హ్యాట్రిక్ ను దక్కించుకోవడం ఖాయం అంటూ కూడా ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో జగపతి బాబు మరియు శ్రీకాంత్‌ లు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.


× RELATED మినీ రివ్యూ: 'బ్రో డాడీ'
×