బిబి బిగ్ లీక్... ఈవారం ఎలిమినేషన్ షాకింగ్

తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 ముగింపు దశకు వచ్చేంది. మరో మూడు వారాల్లో షో పూర్తి అవ్వబోతుంది. మరో రెండు ఎలిమినేషన్ లు ఉండబోతున్నాయి. ఇప్పటికే వీక్ కంటెస్టెంట్స్ తో పాటు కొందరు పాపులర్ మరియు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ కూడా ఎలిమినేట్ అయ్యారు. అయితే ప్రస్తుతం హౌస్ లో ఉన్న వారిలో ఖచ్చితంగా వీక్ అంటే ప్రియాంక మరో ఇద్దరి పేర్లు వినిపించడం లేదు. యాంకర్ రవి ఖచ్చితంగా టాప్ 5 అంటూ అంతా నమ్మకం వ్యక్తం చేశారు. ట్రోఫీ విజేత కాకపోవచ్చు కాని ఖచ్చితంగా అతడు టాప్ 5 వరకు ఉంటాడని అందరు అనుకున్నారు. బిగ్ బాస్ ను రెగ్యులర్ గా ఫాలో అయ్యే ప్రతి ఒక్కరు కూడా రవి ఎలిమినేషన్ అంటూ ఉండదు.. బిగ్ బాస్ సీజన్ 5 చివరి ఎపిసోడ్ వరకు అతడు ఉంటాడంటూ అంతా నమ్మకం వ్యక్తం చేశారు. కాని అనూహ్యంగా నేడు ఆదివారం ఎపిసోడ్ లో రవి ఎలిమినేట్ అవ్వబోతున్నాడు.

బిగ్ బాస్ ఎలిమినేషన్ పక్రియకు సంబంధించిన షూట్ శనివారం సాయంత్రం రాత్రి సమయంలో చేస్తారు. అలా ప్రతి వారం కూడా శనివారం రాత్రికే ఎవరు ఎలిమినేట్ అనే విషయం లీక్ అవుతూ వస్తోంది. బిగ్ బాస్ సీజన్ 5 లో ఈ వారం ఎలిమినేట్ అయ్యింది యాంకర్ రవి అంటూ లీక్ వచ్చింది. ప్రియాంక లేదా కాజల్ ల్లో ఒకరు ఖచ్చితంగా ఎలిమినేట్ అవుతారని అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా యాంకర్ రవి ఎలిమినేట్ అవ్వడం బిగ్ షాక్ అనడంలో సందేహం లేదు. ప్రతి ఒక్క కంటెస్టెంట్ బిగ్ బాస్ లో అడుగు పెట్టిన తర్వాత బుల్లి తెరపై స్టార్స్ అయ్యారు. కాని బిగ్ బాస్ లోకి వెళ్లక ముందే యాంకర్ రవి బుల్లి తెరపై స్టార్. ఆయన ఎన్నో షో లను చేస్తూ వచ్చాడు. పుష్కర కాలంగా బుల్లి తెర ప్రస్థానం కొనసాగిస్తున్నాడు.

యాంకర్ రవికి ఎంతో మంది అభిమానులు ఉంటారు. ఇలాంటి సమయంలో ఆయన ఇలా ముందే ఎలిమినేట్ అవ్వడం అంటే ప్రేక్షకులు ముఖ్యంగా అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఇప్పటికి దాదాపుగా పది వారాల పాటు ఎలిమినేషన్ లో ఉంటూనే ఉన్నాడు. ప్రతి వారం కూడా సేవ్ అయిన రవి ఈ వారం మాత్రం ఎలిమినేట్ అయ్యాడు. ఆయన ఈ వారం ఉంటే ఖచ్చితంగా మరింత ఎంటర్ టైన్ మెంట్ ను అందించే వాడు. ప్రతి ఒక్క ఒక్కరితో మంచి బాండింగ్ ను మెయింటెన్ చేస్తూ ప్రతి ఒక్కరిని బ్రదర్ గా సిస్టర్ గా చెబుతూ ఆటలో ది బెస్ట్ ఇస్తూ.. గేమ్ లో లాజిక్ తో మైండ్ తో ఆడే రవి ఎలిమినేట్ అవ్వడం విచారకరం అంటూ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
× RELATED మినీ రివ్యూ: 'బ్రో డాడీ'
×