రాధే శ్యామ్ తో ఆమెకు డబుల్ హ్యాట్రిక్

ఒక లైలా కోసం.. ముకుందా సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువ అయ్యేందుకు ప్రయత్నించిన పూజా హెగ్డే అదృష్టి ఆ సమయంలో కలిసి రాకపోవడంతో సక్సెస్ ను దక్కించుకోలేక పోయింది. చిన్న గ్యాప్ తీసుకుని డీజేతో అయిదు ఏళ్ల క్రితం టాలీవుడ్ లో అడుగు పెట్టిన పూజా హెగ్డేకు వరుసగా సినిమా ఆఫర్లు వస్తున్నాయి. కెరీర్ ఆరంభంలో తడబడ్డా కూడా ఇప్పుడు టాలీవుడ్ లో టాప్ స్టార్ హీరోయిన్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈమద్య కాలంలో స్టార్ హీరోలందరికి కూడా ఈమె మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. దాంతో వరుసగా ఈమెకు అయిదు సక్సెస్ లు దక్కాయి. రాధే శ్యామ్ తో ఆరవ సక్సెస్ ను దక్కించుకోబోతుంది. ఈ విషయమై పూజా హెగ్డే చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నట్లుగా చెప్పుకొచ్చింది.

ఎన్టీఆర్ తో నటించిన అరవింద సమేత మొదలుకుని ఆ తర్వాత పూజా హెగ్డే నటించిన మహర్షి.. గద్దలకొండ గణేష్.. అల వైకుంఠపురంలో మరియు మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమాలు మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి. వరుసగా అయిదు సక్సెస్ లను దక్కించుకున్న పూజా హెగ్డే ఆరవ విజయంకు అతి చేరువలో ఉంది. ఖచ్చితంగా త్వరలోనే ఈ అమ్మడు ఆ ఆరవ సక్సెస్ ను రాధే శ్యామ్ విజయంతో దక్కించుకుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అయిదు సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. రాధే శ్యామ్ తో ఖచ్చితంగా డబుల్ హ్యాట్రిక్ కొట్టబోతున్నారా అంటూ సోషల్ మీడియా ద్వారా ఆమెను ప్రశ్నించిన సమయంలో ఖచ్చితంగా రాధే శ్యామ్ సినిమాలోని ప్రేరణ పాత్రతో ఒక మంచి సక్సెస్ ను దక్కించుకుంటాను అనే నమ్మకంను పూజా హెగ్డే వ్యక్తం చేసింది.

ప్రభాస్ హీరోగా నటించిన రాధే శ్యామ్ సినిమా కు రాధాకృష్ణ దర్శకత్వం వహించాడు. యూవీ క్రియేషన్స్ లో నిర్మాణం జరుగుతున్న ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. అయితే సంక్రాంతికి విడుదల అవ్వబోతున్న సినిమా విషయంలో కాస్త గందరగోళం ఉంది. రాజమౌళి తన సినిమాను సంక్రాంతికి కాస్త ముందు విడుదల చేయాలని నిర్ణయించాడు. కనుక రాధే శ్యామ్ కొత్త తేదీలో వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ చాలా మంది అంటున్నారు. అయితే చిత్ర యూనిట్ సభ్యులు మాత్రం ఇప్పటి వరకు సంక్రాంతికే విడుదల అన్నట్లుగా నమ్మకంగా చెబుతున్నారు. రాధే శ్యామ్ తో డబుల్ హ్యాట్రిక్ దక్కించుకోబోతున్న పూజా హెగ్డే ఆ తర్వాత ప్రత్యేక పాత్రలో నటించిన ఆచార్య సినిమా కూడా విడుదల కాబోతుంది. ఆ సినిమాలో చరణ్ కు జోడీగా పూజా హెగ్డే నటించిన విషయం తెల్సిందే.× RELATED మినీ రివ్యూ: 'బ్రో డాడీ'
×