వైసీపీ అధ్యక్ష పదవికి ఎంపీ రఘురామ పోటీనట?

ఏపీ సీఎం జగన్ ను ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి రచ్చ చేస్తున్న వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటు వేయాలని వైసీపీ  ప్రయత్నాలు చేస్తూనే ఉంది.. రఘురామ చర్యలతో వైసీపీ నేతల తలబొప్పి కడుతోంది. ఆయన ఎంపీ సీటుకు ఎసరు తేవాలని ఎంతగా ప్రయత్నించినా ఆ ప్రయత్నాలు ఇప్పటివరకు ముందుకు సాగడం లేదు.  

అయితే వైసీపీ నుంచి వెళ్లగొట్టినా కూడా ఎంపీ రఘురామ మాత్రం ఇంకా తాను వైసీపీ ఎంపీనే అని చెప్పుకుంటున్నారు. తనపై ఇంకా అనర్హత వేటు పడలేదంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మరో బాంబు పేల్చారు.

వైసీపీ అధ్యక్ష పదవికి పోటీచేస్తానని ఎంపీ రఘురామకృష్ణరాజు తాజాగా ప్రకటించి సంచలనం రేపారు. సోమవారం మీడియాతో మాట్లాడిన రఘురామ పార్టీలో సంస్థాగత ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.

తాను క్రమశిక్షణ గల కార్యకర్తను కాబట్టే తనను పార్టీలోంచి తొలగించలేదని రఘురామ తెలిపారు. అధ్యక్ష పదవికి ఎవరైనా పోటీ చేయవచ్చని స్పష్టం చేశారు.వైసీపీ నేతలు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

ఈ క్రమంలోనే తాజాగా స్పీకర్ ఓం బిర్లాకు రఘురామకృష్ణంరాజు లేఖ రాశారు. తనపై దాఖలైన అనర్హత పిటీషన్ ను కొట్టివేయాలని లేఖలో కోరారు.

ఏపీలో అధికార పార్టీకి రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు పక్కలో బల్లెంలో తయారయ్యారు.   ఓ వైపు జగన్ బెయిల్ రద్దు చేయాలని న్యాయపోరాటం చేస్తున్నారు. మరోవైపు జాతీయ స్థాయిలో వైసీపీకి వ్యతిరేకంగా మద్దతు కూడగడుతున్నారు.  ఎంపీ అయిన తననే విచారణ పేరు చెప్పి పోలీసులతో కొట్టించారంటూ అందరికీ లేఖలు రాసి వైసీపీ సర్కార్ ను అభాసుపాలు చేశారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఇది పెద్ద ఇష్యూ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే చాలా మంది ఎంపీలు రఘురామకు మద్దతు తెలిపినట్టు తెలుస్తోంది. ఇప్పుడు వైసీపీ పార్టీలో ఎన్నికలు నిర్వహించాలని.. తాను అధ్యక్ష స్థానానికి పోటీచేస్తానని దుమారం రేపారు.
× RELATED 'కారు' బొర్లా పడుతాది... జాగ్రత్తగా నడపండి...!
×