బాలీవుడ్ హీరోల దృష్టిలో పడేందుకు ప్రయత్నాలా పూజా?

సౌత్ హీరోయిన్స్ ప్రతి ఒక్కరు కూడా బాలీవుడ్ లో సినిమాలు చేయాలని ఆశ పడుతూ ఉంటారు. ముఖ్యంగా హీరోలు మరియు హీరోయిన్స్ అంతా కూడా బాలీవుడ్ సినిమాలు చేసేందుకు ఎంతో ఉబలాట పడుతూ ఉంటారు. ఈమద్య కాలంలో టాలీవుడ్ హీరోలు బాలీవుడ్ లో అడుగు పెడుతున్నారు. కాని సౌత్ హీరోయిన్స్ ఎప్పటి నుండో నార్త్ పై ఆసక్తి చూపిస్తూ అవకాశం దక్కితే చాలు అవతల పడుతున్నారు. ఎంతో మంది సౌత్ స్టార్స్ బాలీవుడ్ లో అడుగు పెట్టి అక్కడ సక్సెస్ దక్కించుకున్నారు. తెలుగు లో హీరోయిన్ గా ప్రస్తుతం స్టార్ హోదాను అనుభవిస్తున్న పూజా హెగ్డే బాలీవుడ్ లో సినిమాల కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే అక్కడ పలు ప్రయత్నాలు చేసినా కూడా అమ్మడికి అక్కడ మంచి కమర్షియల్ బ్రేక్ మాత్రం దక్కలేదు.

ఇప్పటికి అక్కడ గెస్ట్ గానే ఈ అమ్మడు సినిమాలు చేస్తుంది తప్ప అక్కడ వరుసగా సినిమాలు మాత్రం చేయలేక పోతుంది. అందుకే బాలీవుడ్ లో ప్రముఖుల దృష్టిని ఆకర్షించేందుకు గాను ఈ అమ్మడు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అక్కడి పార్టీలకు హాజరు అవ్వడంతో పాటు బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ దృష్టిని ఆకర్షించే విధంగా హాట్ ఫొటో షూట్ లను ఇన్ స్టా లో షేర్ చేస్తుంది. అంతే కాకుండా బాలీవుడ్ ప్రముఖుల సోషల్ మీడియా పోస్ట్ లకు రియాక్ట్ అవ్వడం ద్వారా కూడా వారి దృష్టిలో పడేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ఆమె తీరును చూస్తుంటే అనిపిస్తుంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

తాజాగా బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ ఒక షర్ట్ లెస్ స్పెట్ తో కూడిన సెల్ఫీని షేర్ చేయడం జరిగింది. ఆ సెల్ఫీకి పలువురు పలు రకాలుగా కామెంట్స్ చేశారు. అమ్మాయిలు అబ్బాయిలు అందరు కూడా రణవీర్ టవల్ సెల్ఫీ కి ఫిదా అవుతున్నారు. అదే సెల్ఫీకి పూజా హెగ్డే స్పందిస్తూ టవల్ ఊడి పోయేను జాగ్రత్త అంటూ కామెంట్ పెట్టింది. పూజా కామెంట్ కు చాలా మంది చాలా రకాలుగా స్పందించారు. అయితే రణవీర్ సింగ్ మాత్రం పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. హీరో దృష్టిలో పడటం కోసం పూజా అలా కామెంట్ చేసిందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తుంటే కొందరు మాత్రం పూజా హెగ్డే సమయస్ఫూర్తిని మెచ్చుకుంటున్నారు. ఆమె సెన్సాఫ్ హ్యూమర్ ను అర్థం చేసుకోవాలి కాని ఆమె ఆఫర్ల కోసం అలా చేస్తుందంటూ వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదనే అభిప్రాయంను వ్యక్తం చేస్తున్నారు.
× RELATED నిద్ర పట్టడం లేదా పుష్ప?
×