బాబు.. జగన్ లలో ఓటెవరికి అంటే.... ?

ఏపీ రాజకీయాల్లో చంద్రబాబు జగన్ అగ్రశ్రేణి నేతలు. రెండు ప్రాంతీయ పార్టీలకు ప్రెసిడెంట్స్. ఇక చంద్రబాబుకు సుదీర్ఘకాలం పాటు ముఖ్యమంత్రిత్వం చేసిన అనుభవం ఉంది. జగన్ రెండున్నరేళ్ల సీఎం గా ఉన్నారు. వైసీపీ టీడీపీ ఈ రెండు పార్టీలే ఏపీ రాజకీయ గతిని మారుస్తాయి అనడంలో సందేహం లేదు. కొత్త రాజకీయం అంటూ ఎవరు ముందుకు వచ్చినా కూడా ఇప్పట్లో అది కుదిరే వ్యవహారం కాదు అన్నది నిజం. ఇదిలా రెండు తెలుగు రాష్ట్రాలలో తీసుకుంటే ఏపీ ప్రత్యేకం. ఎందుకంటే ఇక్కడ జాతీయ పార్టీలైన కాంగ్రెస్ బీజేపీ దాదాపుగా నామమాత్రం అయ్యాయి. తెలంగాణాలో అయితే ఆ రెండు పార్టీలకు ఎంతో కొంత ఉనికి ఉంది. ఆశలు ఉన్నాయి.

మరి ఏపీలో చూసుకుంటే కచ్చితంగా ప్రాంతీయ పార్టీల మీదనే జాతీయ పార్టీలు ఆధారపడి తీరాల్సిందే. అందుకే అటు కాంగ్రెస్ అయినా ఇటు బీజేపీ అయినా కూడా ఏపీ రాజకీయాలను తమకు అనుకూలం చేసుకుందామనే చూస్తూ ఉంటాయి. ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి నేరుగా పవన్ పార్టీ జనసేనతో పొత్తు ఉంది. అయినా సరే బలమైన ప్రాంతీయ పార్టీ మద్దతు కావాలన్నది మోడీ షాల ఆలోచనగా ఉందిట. ఏపీలో టీడీపీతో నాలుగేళ్ల పాటు బీజేపీ కలసి ఉంది. కేంద్రంలో మంత్రి పదవులు కూడా టీడీపీ తీసుకుంది. ఇక్కడ బీజేపీకి చంద్రబాబు మంత్రి పదవులు ఇచ్చారు. అంతా బాగానే ఉంది అనుకుంటున్న దశలో పొత్తు బెడిసింది. దాంతో బాబు బయటకు వచ్చారు.

ఆయన ఆ తరువాత సైలెంట్ గా లేరు. ఏకంగా మోడీని కేంద్రంలో దించడానికే చూశారు. దేశమంతా తిరిగారు. కాంగ్రెస్ సహా అనేక ప్రాంతీయ పార్టీలకు బాబు అన్ని రకాలుగా లోపాయికారీ సాయం చేశారని బీజేపీ పెద్దలు ఈ రోజుకీ అనుమానిస్తున్నారుట. అందుకే 2019 ఎన్నికల తరువాత తిరిగి ఎన్డీయే గూటికి వస్తామని బాబు పలు రకాలుగా సంకేతాలు పంపించినా ఎస్ అని చెప్పడంలేదు. ఇదే సమయంలో ఏపీ సీఎం వైసీపీ అధినేత జగన్ కి మాత్రం ఎపుడూ పాజిటివ్ గానే సంకేతాలు పంపుతున్నారు. జగన్ ఎన్డీయేలో చేరాలని మోడీ షా బలంగా కోరుకుంటున్నారు. ఆ మధ్యన జగన్ ఢిల్లీ టూర్ కి వెళ్ళినపుడు అమిత్ షా ఆయనతో చాలా సేపు మాట్లాడారని అందులో ఎన్డీయేలో జగన్ చేరిక మీదనే డిస్కషన్ వచ్చిందని కూడా ప్రచారం అయితే సాగింది.

అయితే జగన్ మాత్రం ఎందుకో ఎన్డీయేలో చేరికకు దూరం అంటున్నారు. ఒకవేళ ఎన్డీయేలో చేరాల్సి వస్తే ముందు రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలగకుండా చూడాలన్నది కూడా ఆయన ఆలోచనగా చెబుతారు. ప్రత్యేక హోదా సహా విభజన హామీలు పోలవరం ప్రాజెక్ట్ పూర్తికి సవరించిన నిధుల ఆమోదం వంటివి ఫుల్ ఫిల్ చేస్తేనే తాను ఎన్డీయేలో చేరుతానని జగన్ చెప్పినట్లుగా కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. అలా జగన్ ఎన్డీయేల మధ్య ఒక దాగుడుమూతలాట సాగుతోంది.

ఇక తాజాగా కేంద్ర మంత్రి రామ్ దాస్ అధవాలే అయితే జగన్న్ని ఎన్డీయేలో చేరమని ఆహ్వానించారు. వచ్చే ఎన్నికల్లో మరోమారు మోడీ ప్రధాని కావాలీ అంటే జగన్ లాంటి బలమైన ప్రాంతీయ పార్టీల అధినేత సాయం అవసరం. ఈ సంగతి బీజేపీ పెద్దలకు తెలిసే జగన్ ని రా రమ్మంటున్నారు. ఇపుడు కేంద్ర మంత్రి రామ్ దాస్ నోట ఈ మాట వచ్చింది అంటే కచ్చితంగా బీజేపీ మాట కూడా అదే అంటున్నారు. అంటే ఏపీ విషయానికి వస్తే జగన్ తోనే తమ ప్రయాణం అని బీజేపీ ఒక స్థిరమైన నిర్ణయానికి వచ్చిందనే అంటున్నారు. దానికి అనేక కారణాలు ఉన్నాయి. చంద్రబాబు ఏ క్షణాన ఎటు వైపు ఉంటారో తెలియదు మరో వైపు యువకుడు అయిన జగనే మళ్ళీ ఏపీలో గెలుస్తారు అన్న నివేదికలు కూడా ఉన్నాయట. బాబు ప్రభ అంతా మసకబారింది అన్న చర్చ కూడా జాతీయ రాజకీయాలలో సాగుతోందిట. అందుకే బాబుని పక్కన పెట్టి మరీ జగన్నే పదే పదే పిలుస్తున్నారుట. మరి దీనికి జగన్ ఏమంటారో ఈసారి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
× RELATED హైదరాబాద్ లో రేవ్ పార్టీ: 44మంది హోమో సెక్స్ వల్స్
×