త్వరలోనే ఏపీలో మరో మినీ సమరం

ఆంధ్రప్రదేశ్లో మరోసారి ఎన్నికల వాతావరణం కనిపించనుంది. వివిధ కారణాలతో కొన్ని స్థానాల్లో ఆగిపోయిన పోలింగ్ ను నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. త్వరలో వీటికి ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో మరోసారి 12 స్థానాల్లో ఎన్నికల సందడి నెలకొననుంది. ఏపీలో గత సంవత్సరకాలంగా వరుసగా ఎన్నికల ఊపు కొనసాగుతోంది. పంచాయతీ ఎన్నికల నుంచి జడ్పీటీసీ ఎంపీటీసీ మున్సిపల్ ఎన్నిలు నిర్వహించారు.ఈ ఎన్నికల్లో అధికార పార్టీ దాదాపు క్లీన్ స్వీప్ చేసేసింది. అయితే వివిధ కారణాలతో కొన్ని స్థానాల్లో పోలింగ్ నిలిచిపోయింది. ఆ స్థానాల్లో ఇప్పుడు ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు.

రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల్లోని 12 స్థానాల్లో వివిధ కారణాలతో ఎన్నికలు నిలిచిపోయియి. వీటిలో మున్సిపల్ కార్పొరేషన్ స్థానాలు ఉన్నాయి. గుంటూరు కృష్ణా చిత్తూరు అనంతపురం నెల్లూరు కడప కర్నూలు ప్రకాశం పశ్చిమగోదావరి జిల్లాల్లోని 12 స్థానాలకు పొలింగ్ బ్రేక్ పడింది. ప్రాంతాలవారీగా చూస్తే ఉత్తరాంధ్ర మినహా కోస్తా రాయలసీమ జిల్లాల్లో ఎన్నికల సందడి నెలకొననుందన్నమాట. దీంతో రాజకీయ నాయకులు ఆయా స్థానాల్లో పాగా వేసేందుకు ఇప్పటి నుంచే కసరత్తులు ప్రారంభించారు.

ఈ ఎన్నికలకు సంబంధించి ముసాయిదా విడుదల చేయాలని ఎన్నికల కమిషన్ ఆయా జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని ఈనెల 23న ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేయనున్నట్లు సమాచారం. నెల్లూరు కార్పొరేషన్ కమలాపూరం బుచ్చిరెడ్డిపాలెం గురజాల దాచేపల్లి జగ్గయ్యపేట ఆకీవీడు కొండపల్లి దర్శి కుప్పం బేతం చెర్ల రాజంపేట పెనుగొండ మున్సిపాలిటీల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇవే కాకుండా ఆయా స్థానాల్లో చనిపోయిన కార్పొరేటర్లు కౌన్సిలర్ల స్థానాలకు కూడా ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది.

కొన్ని నెలల కిందట జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటర్ల జాబితాపై వివాదాలు వచ్చాయి. దీంతో ఆయా స్థానాల్లోల ఎన్నికలను నిలిపివేశారు.దీంతో రాజకీయ ప్రతినిధులను పిలిపించి సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. ఓటర్లపై ఎలాంటి వివాదం లేకుండా సమస్యను పరిష్కరించేందుకు కమిషన్ ముందకు వెళ్లనుంది. అయితే రాజకీయ సలహాలు సూచనలకు ఓ తేదీని డిసైడ్ చేసి ఆ తరువాత ఎన్నికల ప్రక్రియకు వెళ్లనుంది.

2019అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైసీపీ ప్రతీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేస్తూ వస్తోంది. ఉప ఎన్నికల్లోనూ ఫ్యాన్ పార్టీదే పైచేయి ఉంటోంది. గత స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అత్యధిక స్థానాలను కైవసం చేసుకొని మున్సిపల్ చైర్మన్ కార్పొరేషన్ చైర్మన్లను దక్కించుకుంది. అయితే ఈ ఎన్నికల్లోనూ అధికార పార్టీనే గెలుస్తుందని అంటున్నారు. అయితే కొన్ని స్థానాల్లో ఏకగ్రీవం చేసేందుకు సమాయత్తమవుతున్నారు. ఈ ఎన్నికల ఫలితాలు ప్రభుత్వంపై పెద్దగా ప్రభావం లేకపోయినా తమన ప్రజలు ఆదరిస్తున్నామని చెప్పుకోవడానికి వీటిని సూచిగా చెప్పనున్నారు.

ప్రభుత్వంపై నిత్యం విమర్శలు చేస్తూ.. పార్టీ పటిష్టతను పెంచుకుంటున్న జనసేన ఈ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయని అంటున్నారు. ఎందుకంటే గత ఎంపీటీసీ ఎన్నికల్లో జనసేన జోరు కనిపించింది. కొన్ని స్థానాల్లో ఎంపీపీ ని కూడా గ్లాస్ పార్టీ గెలుచుకుంది. మరోవైపు ప్రభుత్వంపై పోరాడుతున్న పవన్ వైపు జనాలు ఆసక్తి చూపుతున్నారని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. అయితే ఒకవేళ జనసైనికులను ఆదరించినా అభివృద్ధి అంటూ మళ్లీ అధికార పార్టీ తీర్థం పుచ్చుకుంటారనడంలో ఆశ్చర్యం లేదని కొందరు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే అధికార పార్టీ నాయకులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సీట్లను వదులుకునేది లేదంటున్నారు. ముఖ్యంగా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రాతినిథ్యం వహిస్తున్న నెల్లూరు కార్పొరేషన్లో రాజకీయం హాట్ హాట్ గా సాగనుంది.
× RELATED హైదరాబాద్ లో రేవ్ పార్టీ: 44మంది హోమో సెక్స్ వల్స్
×