500 కోట్ల పెట్టుబడితే ప్రభాస్ బిజినెస్!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఆదాయం గురించి చెప్పాల్సిన పనిలేదు. `బాహుబలి` తర్వాత ప్రభాస్ పారితోషికం రెట్టింపు అయింది. ప్రస్తుతం వరుసగా నాలుగు పెద్ద ప్రాజెక్ట్ లు చేస్తోన్న సంగతి తెలిసిందే. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో `రాధేశ్యామ్`..ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో `సలార్`....బాలీవుడ్ దర్శకుడు ఓరౌంత్ తో కలిసి `ఆదిపురుష్` లో నటిస్తున్నారు. ఇవి గాక నాగ్ అశ్విన్ దర్శకత్వంలో `ప్రాజెక్ట్ కె` లోనూ నటిస్తున్నాడు. ఈ సినిమాలన్నింకి కలిపి ..ప్రభాస్ గ్రాప్ మొత్తం పరిశీలిస్తే అతని ఆదాయం భారీగానే పైగానే ఉంటుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఇంకా లైన్ లో పెట్టిన సినిమాల నుంచి భారీగా అడ్వాన్సులు కూడా అందుకున్నాడని సమాచారం.

అయితే ముందుగా 500 కోట్ల పెట్టుబడి వ్యాపారం రంగంలో పెట్టాలని ప్రభాస్ ప్లాన్ చేస్తున్నాడుట. దీనిలో భాగంగా ప్రభాస్ స్నేహితులు..సన్నిహితులు వివిధ వ్యాపారాల గురించి డార్లింగ్ వద్ద డిస్కస్ చేసినట్లు సమాచారం. కొంత మంది రియల్ ఏస్టేట్ లో పెట్టమని కోరగా..మరికొంత మంది హోటల్ రంగంలో బాగుటుందని సజ్జెస్ట్ చేసినట్లు ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది. ఇంకొంత మంది మంది ఇండియా లో హాటలో రంగం కన్నా విదేశీ హోటల్ లో పెట్టుబడులు పెడితే ఆదాయం బాగుంటుందని సలహాలు ఇచ్చారుట. అయితే ప్రభాస్ నిర్ణయం ఇంకా తీసుకోలేదని..కేవలం వాళ్ల నుంచి సలహాలు మాత్రమే తీసుకున్నట్లు సమాచారం.

మరి ప్రభాస్ మనసులో ఏముందో? తెలియాల్సి ఉంది. ఇక ప్రభాస్ స్నేహితులైన యూవీ క్రియేషన్స్ అధినేతలు వంశీ-ప్రమోద్ లతో కలిసి డిస్ర్టిబ్యూషన్ రంగంలో ప్రభాస్ ఉన్నారు. ఆ బ్యానర్లో సినిమాలు చేస్తే ఎలాంటి పారితోషికం తీసుకోకుండా వచ్చిన లాభాల్లో వాటాలు తీసుకుంటారు. అలాగే డిస్ర్టిబ్యూషన్ లో వాటా కూడా అందుకుంటారు. ఈ నేపథ్యంలో వంశీ-ప్రమోద్ ల సలహాలే ఇక్కడ కీలకంగా పని చేస్తాయని తెలుస్తోంది.
× RELATED అభిమానులతో మెగా మీటింగ్... ?
×