ఎవరెస్ట్ అధిరోహకురాలి బయోపిక్ లో జాన్వీ

కపూర్ ఫ్యామిలీ నుంచి సోనమ్ కపూర్ తర్వాత మళ్లీ అంతటి పాపులారిటీని సాధించింది జాన్వీ కపూర్. ఇండస్ట్రీలో ఫ్యాషనిస్టాగా వెలుగులు విరజిమ్ముతోంది. నిరంతరం లేటెస్ట్ ట్రెండీ ఫ్యాషన్స్ ని అనుసరిస్తూ యువతరంలో భారీ ఫాలోయింగ్ ని పెంచుకుంది.

తాజాగా జాన్వీ బ్రౌనిష్ స్వెట్ షర్ట్ ధరించి కిల్లర్ లుక్ తో కట్టి పడేసింది. కెరీర్ మ్యాటర్ కి వస్తే.. జాన్వీ కపూర్ తన కెరీర్ ఆద్యంతం ప్రయోగాత్మక కథల్ని ఎంచుకుని దూసుకెళుతున్న సంగతి తెలిసిందే. బయోపిక్ లపైనా జాన్వీ ఎంతో ఆసక్తిగా ఉంది. ఇంతకుముందు కార్గిల్ గర్ల్ - గుంజన్ సక్సేనా బయోపిక్ లో నటించింది. తదుపరి మరో బయోపిక్ కోసం సన్నాహకాల్లో ఉంది.

దిల్లీలో సోమవారం జరిగిన టోక్యో ఒలింపిక్స్ లో పారాలింపియన్స్ అత్యుత్తమ ప్రదర్శనకారుల సన్మాన కార్యక్రమానికి జాన్వీ హాజరయ్యారు. నటి అక్కడ అనేక మంది క్రీడాకారులతో సంభాషించారు. అదే వేదికపై తన రహస్య కోరికను కూడా పంచుకుంది. తాను అరుణిమ సిన్హా పాత్రను పెద్ద తెరపై చూపించడానికి ఇష్టపడతానని వెల్లడించింది. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొట్టమొదటి అవయవదాన మహిళ అరుణిమ. ఆమె ప్రయాణం స్ఫూర్తిదాయకంగా ఉంది. జాన్వి సదరు క్రీడాకారిణి జీవితకథను తెరపైకి తీసుకురావాలని కోరుకుంటోంది.

నేను అరుణిమ సిన్హాను కలిశాను. తన కథ చాలా స్ఫూర్తిదాయకం. ఆమె కథలో నటించడానికి ఇష్టపడతాను.. అంటూ ప్రకటించింది. జాన్వీ ఈ ఈవెంట్ లో ఎంతో అందమైన చీరలో కనిపించింది. జాన్వీ నటించిన గుడ్ లక్ జెర్రీ విడుదల కావాల్సి ఉంది.
× RELATED యువ క్రియేటర్ ని పొగిడేసిన జక్కన్న-తారక్
×