దసరా బరిలో 'బొమ్మరిల్లు' బ్యాచ్.. సాలిడ్ కమ్ బ్యాక్ ఇస్తారా..?

దిల్ రాజ్ బ్యానర్ లో 15 ఏళ్ల క్రితం వచ్చిన 'బొమ్మరిల్లు' సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏకంగా ఆయన ఇంటి పేరునే మార్చేసింది. స్టార్ హీరోలతో సినిమాలు చేసే అవకాశం అందించింది. ఇందులో హీరోగా నటించిన సిద్ధార్థ్.. 'బొమ్మరిల్లు సిద్ధార్థ్' గా పిలవబడుతున్నారు. ఈ సినిమాలో హాసిని పాత్రలో నటించిన జెనీలియా ఒక్కసారిగా స్టార్ హీరోయినన్స్ జాబితాలో చేరిపోయింది. ఓవర్ నైట్ స్టార్ డమ్ తెచ్చుకున్న హీరో సిద్దార్థ్ - డైరెక్టర్ భాస్కర్ ఇద్దరూ వరుస ప్లాప్ లతో కొన్నాళ్లు టాలీవుడ్ కు దూరంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది.

అయితే ఇప్పుడు 'బొమ్మరిల్లు' భాస్కర్ - సిద్దార్థ్ ఇద్దరూ తెలుగు చిత్ర పరిశ్రమలోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఆసక్తికరంగా వీరిద్దరూ 8 ఏళ్ల గ్యాప్ తర్వాత తెలుగు సినిమాలలో భాగం అవుతున్నారు. వచ్చీ రావడంతోనే బాక్సాఫీస్ వద్ద ఫైట్ చేయడానికి రెడీ అయ్యారు. భాస్కర్ దర్శకత్వం వహించిన మూవీ.. సిద్దార్థ్ హీరోగా నటించిన సినిమా రెండూ దసరా కానుకగా విడుదల అవుతున్నాయి. అఖిల్ అక్కినేని - పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా రూపొందిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' చిత్రం అక్టోబర్ 15న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అజయ్ భూపతి దర్శకత్వంలో శర్వానంద్ - సిద్దార్థ్ కలిసి నటించిన 'మహా సముద్రం' సినిమా ఒకరోజు ముందుగా (అక్టోబర్ 14) థియేటర్లలోకి వస్తోంది.

'మహా సముద్రం' - 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' చిత్రాలు రెండూ విభిన్నమైన జోనర్స్ లో వస్తున్న సినిమాలు. వేటికవే ప్రత్యేకమైనవి. ఒకటి ఇంటెన్స్ లవ్ అండ్ యాక్టన్ డ్రామా అయితే.. మరొకటి యూత్ ఫుల్ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. రెండు సినిమాలు కూడా ఆకట్టుకునే ప్రోమోలతో స్ట్రాంగ్ ప్రమోషన్లతో పాజిటివ్ బజ్ ను క్రియేట్ చేసుకున్నాయి. అఖిల్ సినిమా ట్రైలర్ - సాంగ్స్ విశేష స్పందన తెచ్చుకున్నాయి. అలానే శర్వా - సిద్దార్థ్ మల్టీస్టారర్ ప్రమోషనల్ కంటెంట్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ క్రమంలో రెండు సినిమాలపై జనాల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

దసరా బరిలో నిలుస్తున్న ఈ క్రేజీ మూవీస్ మంచి ఓపెనింగ్స్ రాబట్టే అవకాశం ఉంది. ఇప్పటికైతే ప్రీ బుకింగ్స్ కూడా ఆశాజనకంగా ఉన్నాయి. ఓవర్ సీస్ మార్కెట్ లో మంచి ప్రభావం చూపుతాయని మేకర్స్ భావిస్తున్నారు. మరి ఈ రెండు చిత్రాల్లో ఏది ప్రేక్షకాదరణ దక్కించుకుంటుందో చూడాలి. ఇకపోతే 'బొమ్మరిల్లు' దర్శక హీరోల కెరీర్ కు ఈ సినిమాల విజయం కీలకమనే చెప్పాలి. అందుకే వీటిపై ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. ఒకరోజు గ్యాప్ తో వస్తున్న భాస్కర్ - సిద్దార్థ్ సాలిడ్ హిట్ అందుకొని స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇస్తారో లేదో చూడాలి.

'మహా సముద్రం' చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్నారు. అదితిరావు హైదరి - అను ఇమ్మాన్యుయేల్ ఇందులో హీరోయిన్లు. చైతన్ భరద్వాజ్ సంగీతం సమకూర్చగా.. రాజ్ తోటా ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించారు. 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీ వాసు - వాసు వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గోపీ సుందర్ ఈ చిత్రానికి మ్యూజిక్ కంపోజ్ చేయగా.. ప్రదీశ్ వర్మ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు. ఈ రెండు సినిమాలకు అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేయడం గమనార్హం.


× RELATED దేశంలోనే ప్రభాస్ నెం-1..ఆ తర్వాత `కేజీఎఫ్` స్టార్!
×