స్వలింగసంపర్కులైన సూపర్ మేన్ ..!

వరల్డ్ వైడ్ గా `సూపర్ మేన్`కు ఉన్న క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. పెద్ద తెర.. చిన్నతెర అనే తేడా లేకుండా సూపర్ మేన్ అంటే అన్నిచోట్లా సంచలనమే. తాజాగా కామిక్స్ తదుపరి సంచికలో సూపర్ హీరో జాన్ కెంట్ బైసెక్సువల్ అని డీసీ కామిక్స్ ప్రకటించింది. `సూపర్ మ్యాన్ :సన్ ఆఫ్ కల్ -ఎల్` సిరీస్ లో భాగంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సంచిక నవంబర్ లో రిలీజ్ అవుతుంది. ఇందులో జాన్ తన స్నేహితుడు జేన్-కమురాతో ప్రేమలో పడతాడు. వారిద్దరి మధ్యా లైంగిక సంబంధం ఏర్పడుతుంది. ఈ సిరీస్ లో పూర్తిగా జాన్ తన తండ్రి క్లార్క్ కెంట్ నుంచి సూపర్ మ్యాన్ వారసత్వాన్ని అందుకుని సాహసాలు చేస్తుంటాడు.

అదే సమయంలో జాన్-జేన్ ల మధ్య రొమాంటిక్ బాండింగ్ బలపడనుందని తెలుస్తోంది. జాన్ అందరినీ కాపాడే ప్రయత్నంలో మానసికంగా.. శారీరకంగా అలసిపోతాడు. ఆ సమయంలో ఇద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుందని తెలుస్తోంది. అమెరికాలో ఎల్జీబీటీ సముదాయంపై అవగాహన కార్యక్రమంలో భాగంగా ప్రతీ ఏడాది అక్టోబర్ 11న నేషనల్ కమింగ్ అవుట్ డే జరుపుకుంటారు. ఈ సందర్భంగానే `సూపర్ హీరో బై సెక్సువల్` అని డీసీ కామిక్ ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో జాన్-జేన్ ముద్దు పెట్టుకుంటున్న చిత్రాల్ని కూడా డీసీ కామిక్ రిలీజ్ చేసింది.

ఈ సందర్భంగా రచయిత టామ్ లేటర్ మాట్లాడుతూ..``తొలిసారి ఇలాంటి కథ రాయమని అడిగినప్పుడు..ఈ కాలపు సూపర్ మ్యాన్ ఎలా ఉండాలి? అని ఆలోచించాను. ఈ నేపథ్యలో జాన్ కెంట్ పాత్రను బైసెక్సువల్ గా మారిస్తే బాగుంటుందని అనుకున్నా. అప్పటికే డీసీ కామిక్ కూడా అలాంటి ఆలోచన కలిగి ఉండటంతో నా ఊహకు వాళ్ల ప్రోత్సాహం తోడైంది . పదేళ్ల క్రితమే ఇలాంటి ఆలోచన ఉన్నా అప్పుడు ఇది సాధ్యం కాదు...కానీ ఇప్పుడు సాద్యమైందని సంతోషం వ్యక్తం చేసారు. దీనిపై సోషల్ మీడియాలో కొన్ని విమర్శలు వచ్చినప్పటికీ.. చాలామంది సానుకూలంగానే స్పందించారని టేలర్ తెలిపారు. తమలాంటి బైసెక్సువల్ వ్యక్తుల్ని సూపర్ మ్యాన్ లుగా చూపించడం తామెప్పుడు ఊహించలేదని స్వలింగ సంపర్కుల వర్గం సంతోషం వ్యక్తం చేస్తోంది.× RELATED 'చిరంజీవి - పవన్ కళ్యాణ్ లేకపోతే అసలు నాగబాబు ఎవరు?'
×