ప్రపంచంలోనే అత్యంత పొడవైన మహిళ .. ఎక్కడ ఉందంటే ?

కాళ్లు.. అనగానే అలా వైకుంఠపురంలో..సినిమాలోని నీ కాళ్లని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు..పాటే గుర్తుకు వస్తుంది. అందులో బంటు క్యారెక్టర్ పోషించిన అల్లు అర్జున్  హీరోయిన్ పూజా హెగ్డే కాళ్లను మాత్రమే చూస్తే మైమరిచిపోవడం తెలిసిందే. ఆమె పొడవైన కాళ్లకు బంటూ బానిసైనట్లే టర్కీకి  చెందిన ఈమె కాళ్లను హైట్ ను  చూసి ఫిదా అవుతున్నారు. టర్కీకి చెందిన 24 ఏళ్ల రుమేసా గెల్గి ప్రపంచంలోనే అత్యంత పొడవైన మహిళగా ప్రకటించారు. అంతే కాదు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఆమెను సజీవంగా ఉన్న పొడవైన మహిళగా పేర్కొంది.

రుమేసా అసాధారణమైన పెరుగుదలకు కారణం వీవర్స్ సిండ్రోమ్ అని వైద్య నిపుణలు వెల్లడించారు. ఇది ఒక అరుదైన జన్యుపరమైన రుగ్మతగా పేర్కొన్నారు. దీంతో  ఆమె అసాధారంగా పెరగడమే కాక చేతులు 24.5 సెంటిమీటర్లు పాదాలు 30.5 సెం.మీ. పొడవు ఉన్నట్లు వివరించారు. దీంతో ఆమె నడవడానికి ఇబ్బంది పడటమే కాక అనేక శారీరక సమస్యలతో బాధపడుతోందన్నారు. ఈ మేరకు ఆమె ఎక్కువగా వీల్ చైర్ లేదా వాకింగ్ ఫ్రేమ్ సాయంతో నడుస్తోంది. ప్రస్తుతం ఇది కాస్త నెట్టింట తెగ వైరల్ అయ్యింది. ప్రతి ప్రతికూలత మనకు ప్రయోజనకారే మీరు మీ సామర్థ్యాన్ని గుర్తించండి అంటూ ఒకరూ.. మరొకరేమో గుంపులో ఒకరుగా కాక మీకంటూ ఒక ప్రత్యేకతను కలిగిన వ్యక్తిగా ఉంటారంటూ’ నెటిజన్లు రకరకాలుగా ఆమెకి ధైర్యం నూరిపోస్తు ప్రోత్సహిస్తున్నారు.

ఇక ఇదిలా ఉంటే కేవలం కాళ్లు మాత్రమే ఎక్కువ పొడవు ఉన్నాయని మరో అమ్మాయి గిన్నిస్ బుక్ ఎక్కింది. మెసి క్యుర్రిన్ అనే ఈ 17 ఏళ్ల అమ్మాయి.. తన పొడవైన కాళ్లతో గిన్నీస్ రికార్డుల్లోకి ఎక్కేసింది. చిన్న వయస్సులోనే 6 అడుగుల 10 ఇంచుల పొడవున్న ఈమె బాస్కెట్ బాల్లో రష్యాన్ బాస్కెట్ బాల్ టీమ్ కు చుక్కలు చూపించింది. ఆమె పొడవును చూసి.. గిన్నీస్ రికార్డు అధికారులే ఆశ్చర్యపోయారు. వెంటనే ఆమె కాళ్ల కొలతలు తీసుకుని.. ప్రపంచంలో మరెవ్వరికీ అంత పొడవైన కాళ్లు లేవని తేల్చేశారు. ఇంతకీ మెసి కాళ్ల పొడవు ఎంతో తెలుసా  4 అడుగుల 5 ఇంచులు. అంటే.. ఆమె శరీరంలో సగం కంటే ఎక్కువ కాళ్లే ఉన్నాయన్నమాట.

ఆ ఇంట్లో కేవలం మెసి మాత్రమే కాదు. ఆమె తండ్రి సోదరుడు కూడా పొడవే. తండ్రి 6 అడుగుల 5 ఇంచుల పొడవు. తమ్ముడు 6 అడుగుల 3 ఇంచుల పొడవు ఉన్నారు. మెసీ 9 ఏళ్ల వయస్సులోనే 5.7 అడుగుల పొడవు ఉండేదట. ప్రస్తుతం మెసీ పేరు ‘ప్రపంచంలోనే అత్యంత పొడవైన కాళ్లు గల టీనేజర్’గా మాత్రమే గిన్నీస్ వరల్డ్ రికార్డుల్లో నమోదైంది. ఈమె ప్రపంచంలోనే అత్యంత పొడవైన మహిళ మరో రికార్డును బద్దల కొట్టాలంటే మాత్రం మరి కొన్ని ఇంచుల ఎత్తు ఎదగాలి.
× RELATED కారుణ్య నియామకాలపై జగన్ సంచలన నిర్ణయం
×