ఇండియాస్ బిగ్గెస్ట్ మూవీ చేతులు మారింది ఇలా..!

ఇండియాస్ బిగ్గెస్ట్ మూవీస్ అనగానే బాహుబలి గుర్తుకు వస్తుంది. ఆ తర్వాత బాలీవుడ్ దంగల్ పేరు వస్తుంది. అమీర్ ఖాన్ నటించిన దంగల్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా రెండు వేల కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డుల వర్షం కురిపించింది. దంగల్ వచ్చి ఇన్నాళ్లు అయినా ఆ రికార్డును మాత్రం ఎవరు బ్రేక్ చేయలేక పోయారు. దంగల్ లో అమీర్ ఖాన్ నటించిన తీరు మరియు ఆయన తన బాడీని మార్చుకున్న విధానం ఒక అద్బుతం అన్నట్లుగా విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు. అద్బుతమైన ఒక కథను అందరికి అర్థం అయ్యేలా చక్కగా దర్శకుడు నితేష్ తివారి తెరకెక్కించాడు. దంగల్ కథ తయారు చేసుకున్న సమయంలో నితేష్ తివారి మొదటగా అమీర్ ఖాన్ ను కాకుండా మరో నటుడిని అనుకున్నాడట. కాని కొన్ని కారణాల వల్ల అమీర్ ఖాన్ దంగల్ లోకి ఎంటర్ అయ్యాడు.

నితేష్ తివారి దంగల్ కథను తయారు చేస్తున్న సమయంలో ఇర్ఫాన్ ఖాన్ ప్రథాన పాత్ర అనుకుని తయారు చేయడం జరిగిందట. కాని ఇర్ఫాన్ ఖాన్ వరుస సినిమాలను కమిట్ అయ్యి రెండేళ్ల వరకు ఖాళీ లేక పోవడంతో ఆ కథ కాస్త అమీర్ చెంతకు చెరింది. విలక్షణ సినిమాలను ఇష్టపడే అమీర్ ఖాన్ కు కథ విన్న వెంటనే నచ్చింది. అంత పెద్ద ఆడపిల్లల తండ్రి పాత్రకు అమీర్ ఖాన్ నటించేందుకు ఒప్పుకుంటాడని మొదట్లో దర్శకుడు నితేష్ తివారి అనుకోలేదట. అనూహ్యంగా దంగల్ సినిమా కథలో నటించేందుకు అమీర్ ఖాన్ ఓకే చెప్పడం మాత్రమే కాకుండా తనను తాను పూర్తిగా మార్చుకునేందుకు కూడా సిద్దం అయ్యాడట. కథానుసారంగా తానే నిర్ణయం తీసుకుని కొత్త లుక్ కు వచ్చాడు.

అయిదు పదుల వయసు వ్యక్తిగా చాలా లావు మరియు పొట్టతో అమీర్ ఖాన్ సినిమాలో కనిపించాడు. అమీర్ ఖాన్ కాకుండా ఇర్ఫాన్ ఖాన్ దంగల్ చేసి ఉంటే ఖచ్చితంగా ఇప్పటి వరకు దంగల్ గురించి మాట్లాడుతూ ఉండక పోవచ్చు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి దంగల్ సినిమా లభించడం అమీర్ ఖాన్ అదృష్టం.. అలాగే అమీర్ ఖాన్ లభించడం దంగల్ అదృష్టం అనడంలో సందేహం లేదు. దంగల్ ఇప్పుడే కాదు ఇండియన్ సినీ చరిత్ర లో ఎప్పటికి నిలిచి పోయి ఉంటుంది. అమీర్ ఖాన్ సినీ జీవితంలో ఒక మరపురాని సినిమాగా కూడా దంగల్ నిలుస్తుంది అనడంలో సందేహం లేదు.× RELATED మెగా వెబ్ సైట్ ని లాంచ్ చేసిన మెగా పవర్ స్టార్!
×