ఆమెకు ఫ్యాషన్ ప్రాణం.. అందుకే నిఫ్ట్ నే వదిలేసింది

ఢిల్లీ నేషనల్ ఇన్సిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ లో ప్రొఫెసర్ జాబ్ అంటే మామూలు విషయం కాదు. పెద్ద మొత్తంలో జీతం.. గెస్ట్ లెక్చర్స్ కు లక్షల్లో పారితోషికం ఇంకా పేరు చాలా చాలా ఉంటాయి. అలాంటి అద్బుతమైన జాబ్ ను ఆమె వదిలేసి ఫ్యూచర్ ఉంటుందో లేదో తెలియని ఫ్యాషన్ రంగంలోని తన పాషన్ తో అడుగు పెట్టింది నిటాషా. తన జీవితంలో రిస్క్ తీసుకున్నా.. ఆమెను తమ ఫ్యాషన్ డిజైనర్ గా పెట్టుకుని ఎవరు రిస్క్ తీసుకుంటారని చాలా మంది అనుకున్నారు. కాని అనూహ్యంగా ఆమకు అదృష్టం కొద్ది రణ్ వీర్ సింగ్ అవకాశం ఇచ్చాడు. అప్పట్లో ఆయన కెరీర్ ఆరంభ దశలోనే ఉంది. అయినా కూడా కొత్త లుక్ ను.. కొత్తగా స్టైలింగ్ ను చూపించాలనే ఉద్దేశ్యంతో నిటాషా కు అవకాశం ఇచ్చాడు. ఫిల్మ్ ఫేర్ కవర్ పేజీకి రణ్ వీర్ సింగ్ ఫొటో షూట్ చేయడం జరిగింది. దానికి గాను ఫ్యాషన్ డిజైనర్ గా నిటాషా చేసింది.

ఆ కవర్ బయటకు వచ్చిన తర్వాత రణ్ వీర్ సింగ్ గురించి మాట్లాడుకోకుండా ఫ్యాషన్ డిజైనర్ గురించి మాట్లాడుకున్నారు. అంతటి గుర్తింపును ఒక్క ప్రాజెక్ట్ తోనే దక్కించుకుంది. అలా దక్కిన అవకాశంను సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఆమె ఏకంగా పదేళ్ల పాటు టాప్ ఫ్యాషన్ డిజైనర్ గా బాలీవుడ్ లో కొనసాగుతున్నారు. ఒక హీరో లుక్ డిజైన్ చేయాలంటే.. డైరెక్టర్ అభిరుచిని అందుకోవాలి.. ఆ హీరో అభిమానులకు నచ్చే విధంగా ఉండాలి అంతే కాకుండా ట్రెండింగ్ గా ఉండాలి కాని రొటీన్ గా ఉండకూడదు. ఇన్ని విషయాలను పరిగణలోకి తీసుకుని ఏదైనా డిజైన్ చేయాల్సి ఉంటుంది. ఆమెకు ఇండస్ట్రీలో దర్శకుల అభిరుచి తెలుసు మరియు ప్రేక్షకుల ఆలోచన కూడా ఆమెకు తెలుసు. అందుకే ఆమె ఫ్యాషన్ ప్రపంచంలో మారు మ్రోగిపోతుంది.

గత పదేళ్లుగా ఆమె బాలీవుడ్ ఫ్యాషన్ రంగంను ఏలేస్తుంది. అంతటి గొప్ప పేరు తెచ్చుకున్న నటాషా సింపుల్ గా ఎప్పటి లాగే ప్రొఫెసర్ గా కొనసాగి ఉంటే ఇంత పెద్ద ఫ్యాషన్ వరల్డ్ ను ఆమె మిస్ అయ్యి ఉండేది. నిర్ణయం సరైన సమయంలో తీసుకుని.. కష్టపడి పని చేస్తే.. నమ్మకంతో ముందుకు వెళ్తే విజయం ఖచ్చితంగా వస్తుంది అనేది నిటాషా ను చూస్తే అర్థం అవుతుంది. ప్రస్తుతం ఆమె బాలీవుడ్ లో రణ వీర్ సింగ్ కు మాత్రమే కాకుండా ప్రియాంక చోప్రా.. అర్జున్ కపూర్.. విద్యా బాలన్.. వరుణ్ దావన్ ఇంకా ప్రముఖ స్టార్స్ కూ కూడా ఫ్యాషన్ డిజైనర్ గా వ్యవహరిస్తోంది. ఆమె ముందు ముందు మరింతగా ఫ్యాషన్ లోకంలో రాణించాలని ఇండస్ట్రీ వర్గాల వారు ఆమెకు పదేళ్ల సందర్బంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
× RELATED 'చిరంజీవి - పవన్ కళ్యాణ్ లేకపోతే అసలు నాగబాబు ఎవరు?'
×