దిల్ రాజు ఫ్యామిలీ హీరో 'రౌడీ బాయ్స్' షూటింగ్ పూర్తి..!

అగ్ర నిర్మాత దిల్ రాజు సోదరుడు శిరీష్ తనయుడు ఆశిష్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ''రౌడీ బాయ్స్''. కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో యూత్ పుల్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో ఆశిష్ సరసన మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. 'హుషారు' ఫేమ్ శ్రీ హర్ష కొనుగంటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.

'రౌడీ బాయ్స్' సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయినట్లు తాజాగా చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సందర్భంగా హీరోహీరోయిన్లు ఆశిష్ - అనుమప తో సహా మిగతా యూనిట్ సభ్యులందరు కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు. చిత్ర నిర్మాతలు దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. రౌడీ బాయ్స్ తమ గ్యాంగ్ తో కలిసి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలిపారు.

కాగా 'రౌడీ బాయ్స్' చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ - మోషన్ పోస్టర్ - టీజర్ - టైటిల్ సాంగ్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు - శిరీష్ నిర్మిస్తున్నారు. హర్షిత్ రెడ్డి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. మధే ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించగా.. మధు ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉంది. దిల్ రాజు ఫ్యామిలీ నుంచి హీరోగా వస్తున్న ఆశిష్ ఫస్ట్ సినిమాతో ఎలాంటి గుర్తింపు తెచ్చుకుంటాడో చూడాలి.
× RELATED యువ క్రియేటర్ ని పొగిడేసిన జక్కన్న-తారక్
×