ఏపీలో సినిమా థియేటర్లలో 100% ఆక్యుపెన్సీకి గ్రీన్ సిగ్నల్..!?

కరోనా వైరస్ ప్రభావం వల్ల మూతబడిన థియేటర్స్ అన్నీ ఇప్పుడు తెరుచుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ రాష్ట్రాల్లో ఇప్పటికే సినిమా హాళ్లు ఓపెన్ అవడంతో కొత్త సినిమాల విడుదలలు ఊపందుకున్నాయి. అయితే తెలంగాణ లో 100 శాతం సీటింగ్ ఆక్యుపెన్సీ తో సినిమాకలు ప్రదర్శిస్తున్నా.. ఏపీలో మాత్రం ఇంకా 50 శాతం ఆక్యుపెన్సీతో సినిమాలు నడుస్తున్నాయి. అలానే కరోనా పరిస్థితుల వల్ల పెట్టిన కర్ఫ్యూ వలన మూడు షోలకు మాత్రమే అనుమతి ఉంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ నిర్మాతలకు థియేటర్ యాజమాన్యాలకు ఏపీ ప్రభుత్వం మరింత వెసులుబాటు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది!. రేపటి నుంచి 100శాతం ఆక్యూపెన్సీతో థియేటర్లు నడిపేందుకు అవకాశం ఇచ్చినట్టు సమాచారం!.

దీంతో దసరా సందర్భంగా రిలీజ్ అయ్యే సినిమాలు వంద శాతం ఆక్యుపెన్సీతో ప్రదర్శించబతాయి. అంతేకాదు రాబోయే రోజుల్లో పెద్ద సినిమాలన్నీ థియేటర్లకు క్యూ కట్టే అవకాశం ఉంది. ఇటీవల టాలీవుడ్ పెద్దలు ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరిపిన నేపథ్యంలో సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకుంది. మంచు విష్ణు 'మా' అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇలాంటి ప్రకటన వెలువడడం ఆసక్తిని రేకెత్తిస్తుంది. మరి త్వరలోనే టికెట్ రేట్లపై కూడా ప్రభుత్వం స్పష్టత ఇస్తుందేమో చూడాలి.
× RELATED ఏమాత్రం వెనక్కి తగ్గని 'మా' ఎన్నికల అధికారి..!
×