జగన్ వర్సెస్ షర్మిల.. అందుకేనా ?

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వర్సెస్ ఆయన సోదరి షర్మిల మధ్య ఎంత కాదనుకున్నా విబేధాలు ఉన్నాయన్నది వాస్తవం. జగన్తో ఎంత విబేధాలు లేకపోతే షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ పెడతారు ? జగన్ పార్టీ పెట్టినప్పటి నుంచి అన్న కోసం ఎంతో కష్టపడిన షర్మిల.. అదే అన్నపై అంత కోపం ఎందుకు పెంచుకున్నారు ?  వీరిద్దరి మధ్య అసలేం జరిగింది ?  అన్న ప్రశ్నలకు చాలా సందేహాలు వైఎస్ కుటుంబ అభిమానులను సన్నిహితులను వెంటాడుతున్నాయి. షర్మిల గత ఎన్నికలకు ముందు కూడా అన్న కోసం విపరీతంగా ప్రచారం చేశారు. అయితే ఆమెకు మిగిలింది రిక్తహస్తమే..!

షర్మిల ఒంగోలు ఎంపీ సీటు ఆశించినా అది ఇవ్వలేదు.. గెలిచిన వెంటనే రాజ్యసభ వస్తుందని ఆమె ఆశలతో ఉన్నా అది కార్యరూపం దాల్చేలా ఆమెకు కనపడలేదు. ఇక తండ్రి వారసత్వంలో తనకు కూడా ప్రతిఫలం దక్కాలన్నదే షర్మిల కోరిక. కానీ ఆమె పడిన కష్టానికి ఫలితం శూన్యం. అయితే జగన్ వెర్షన్ మరోలా ఉంది.. ఇప్పుడు తాను అనుభవిస్తోన్న ఈ అధికారం.. ఈ పదవి అంతా తన ఓన్ ఇమేజ్తో మాత్రమే వచ్చిందని.. తన విజయంలో షర్మిలకు ఎందుకు క్రెడిట్ ఇవ్వాలన్నదే ఆయన పట్టుదల..! ఇది షర్మిలకు సహజంగానే నచ్చలేదు.

షర్మిలకు పదవి వస్తే పార్టీలో రెండో పవర్ సెంటర్ ఎక్కడ వస్తుందో ? అన్నది జగన్ ఆందోళన. అందుకు జగన్ ఒప్పుకోలేదు. పోనీ ప్రభుత్వంలో సంబంధం లేకుండా ఏ రాజ్యసభో లేదా పార్టీకి ప్రధాన కార్యదర్శి పదవి అయినా ఇవ్వాలని విజయమ్మ జగన్కు చెప్పి చూశారట. అయినా జగన్ వైపు నుంచి కాస్తైనా కనికరం లేదని.. అందుకే షర్మిల తీసుకున్న వేరు కుంపటి నిర్ణయానికి చివరకు విజయమ్మ కూడా మద్దతు ఇచ్చారన్న ప్రచారం వైఎస్ కుటుంబ అభిమానుల నుంచే వినిపిస్తోంది.

యేడాది పాటు జగన్ షర్మిలకు ఏదైనా పదవి ఇస్తారని వేచి చూసిన తర్వాతే విజయమ్మ షర్మిల కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. ఏపీలో ఇప్పుడు బలంగా ఉన్న జగన్ను ఢీ కొట్టడం తనకు సాధ్యం కాదన్నది షర్మిలకు తెలుసు. అందుకే తెలంగాణలో పార్టీ పెట్టడం ద్వారా అటు అన్నకు కంట్లో నలుసులా మారడంతో పాటు.. తమ ఇద్దరి మధ్య ఉన్న విబేధాలను చెప్పకనే చెప్పారు. అసలు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో తెలంగాణలో రాజకీయం చేసి నెగ్గుకు రావడం అనేది సులువు కాదన్నది షర్మిలకు తెలియనిది కాదు..!

అయితే అక్కడ కొత్త పార్టీ పెట్టినా.. ఎన్ని ప్రసంగాలు చేసినా అదంతా ఏపీ రాజకీయాలను టార్గెట్ చేసేదే అనేది అర్థమవుతోంది. రేపటి వేళ ఆమె సడెన్గా ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చినా ఆశ్చర్య పడాల్సిన పనిలేదు. కేవలం అన్నను టార్గెట్గా చేసుకుని ఆమె సరికొత్త రాజకీయానికి తెరలేపారు. ఇక తండ్రి జయంతి వర్థంతి కార్యక్రమాల్లో కూడా వీరు ఒకరినొకరు కలుసుకునేందుకు ఎదురు పడేందుకు కూడా ఇష్టపడడం లేదంటే వీరి మధ్య గ్యాప్ ఎంతలా పెరిగిపోయిందో అర్థమవుతోంది. మరి ఈ అన్నా చెళ్లెల్ల యుద్ధం రెండు తెలుగు రాజకీయాల్లో ఇంకెన్ని ప్రకంపనలు రేపుతుందో ?  వచ్చే ఎన్నికలే డిసైడ్ చేస్తాయనడంలో సందేహం లేదు.

ఈ న్యూస్ గురించి మీ దగ్గర ఏదైనా సమాచారం ఉంటె క్రింద ఉన్న కామెంట్ బాక్స్ లో షేర్ చేసి కామెంట్ రూపం లో మాతో పంచుకోండి.
× RELATED విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. వ్యతిరేకించిన కేంద్ర మంత్రి.. ఇది నిజంగా సంచలనమే
×