ఐటీ సీబీఐ ఈడీ తలుగు వాళ్లమీదేనా? గుజరాతీ వాళ్ల మీద ఉండదా?

ఐటీ దాడులు సీబీఐ సోదాలు ఈడీ తనిఖీలు.. వీటి గురించి ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. అదేసమయంలో విమర్శలు కూడా పోటెత్తుతున్నాయి. అవినీతి చేసిన వారు.. అక్రమాలకు పాల్పడ్డవారు.. దేశ సంపదను దోచేసిన వారు.. ఎవరైనా.. ఎంతటి వారైనా ఈ కేంద్ర దర్యాప్తు సంస్థలు నిఘా పెట్టాల్సిందే. నిగ్గు తేల్చాల్సిందే. అయితే.. ఈ సంస్థల ప్రయోగం విషయాన్ని పరిశీలిస్తే.. మాత్రం ఎంత నిజాయితీ ఉందో..!? అని అనిపించకమానదు. ఎందుకంటే.. వాటిని సెలెక్టెడ్ పీపుల్.. సెలెక్టెడ్ స్టేట్స్.. అన్న విధంగా ప్రయోగిస్తున్నారు కాబట్టి!! ఒకింత నిష్టూరంగా ఉన్నప్పటికీ.. ఆయా కేంద్ర దర్యాప్తు సంస్థలు చేస్తున్న పని.. వీటిని వెనుక ఉండి ఆడిస్తున్నవారి వ్యూహం ఎప్పటికప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది.

నిజానికి దేశం అభివృద్ది చెందుతోంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచిపోతున్నా.. మనం అభివృద్దిలోనే ఉన్నాం. మన పల్లెలు... గ్రామాలు.. అభివృద్దకి ఆమడ దూరంలోనే ఉన్నాయి. నెలకు 10 వేల రూపాయలు కూడా సంపాయించుకోలేని కుటుంబాలు 50 కోట్లకు పైమాటేనని  కేంద్ర ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. మరి.. దేశ పరిస్థితి ఇలా ఉంటే.. కొందరి దగ్గర మాత్రం లక్ష్మీదేవి మూలుగుతోంది. కోట్లకు కోట్ల రూపాయల కట్టలు పేరుకుపోతున్నాయి. సో.. అంటే.. దేశ సంపదను కొందరు మాత్రమే బొక్కేస్తున్నారనే విషయం అర్ధమవుతోంది. మరి వీరిపై చర్యలు తీసుకోవాల్సిందే! దీనిని ఎవరూ కాదనరు. వద్దనరు.. అడ్డు కూడా చెప్పరు. అయితే.. క్షేత్రస్థాయిలో జరుగుతున్నది ఏంటి? అనేది మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్న అంశం.

దేశంలో దోచు కోవడం.. దాచుకోవడం.. ఆనక రాజకీయ వ్యూహాలతో తప్పించుకోవడం అనేది పరిపాటిగా మారిపోయింది. చర్యలు తీసుకునే వారు కూడా వివక్షాపూరిత విధానాలు అనుసరిస్తున్నారనే వ్యాఖ్యలు కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా.. వినిపిస్తూనే ఉంది. అవినీతికి పాల్పడిన వారి విషయంలో సమాన న్యాయం చేయాల్సిన కేంద్ర దర్యాప్తు సంస్థలను కేవలం కొన్ని రాష్ట్రాలపైనే ప్రయోగించడం.. ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. ఇటీవల కాలంలో రెండు తెలుగు రాష్ట్రాలపైనే.. ఐటీ దాడలుఉ జరుగుతన్నాయి. అవినీతికి పాల్పడ్డారంటూ.. తెలుగు రాష్ట్రాల్లోని అనేక మంది ఇళ్లపై దాడులు చేస్తున్నారు. దీనిని తప్పుపట్టాల్సిన అవసరం లేకపోయినా.. దేశం మొత్తంగా చూసుకుంటే.. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే ఇలాంటి వారు ఉన్నారా? అనేది ప్రశ్న.

అంతేకాదు.. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోని అవినీతి పరులపైనే ఇలా దాడులు చేయడాన్ని రాజకీయ పరిశీలకులు.. విస్తు పోతున్నారు. అందరి మీదా చూపించాల్సిన న్యాయం విషయంలో ఇలా ఒకవైపే చేస్తుండడం.. తెలుగు రాష్ట్రాలనే కార్నర్ చేయడంపై సర్వత్రా విస్మయానికి కారణంగా మారుతోంది. వాస్తవానికి దేశంలో ప్రజలను మోసం చేసి.. బ్యాంకులను బురిడీ కొట్టించి వేల కోట్ల రూపాయలు ఎగవేసిన ఇండస్ట్రియలిస్టుల్లో గుజరాత్కు చెందిన వారు 9 మందికి పైగా ఉన్నారని.. కేంద్ర గణాంకాలే చెబుతున్నాయి. వీరు ఈ దేశాన్ని నిండా ముంచేసి.. విదేశాలకు దర్జాగా వెళ్లిపోతున్నారు. అయినప్పటికీ.. వీరిపై చర్యలు ఎక్కడా తీసుకోవడం లేదు. ఐటీ సీబీఐ ఈడీ వంటివి వీరి విషయంలో నిమిత్తమాత్ర పాత్ర పోషిస్తున్నాయి.

అంతేకాదు.. ఇలాంటి వారికి ప్రభుత్వాలు.. రాయితీలు ఇస్తున్నాయి. పన్ను.. ఎక్జెంప్షన్స్ ప్రకటిస్తున్నాయి. వాళ్లను ఎంకరేజ్ చేస్తున్నారు. తర్వాత .. వారు దేశానికి కుచ్చుటోపీ పెట్టి విదేశాలు పారిపోయినా.. చేతులు కట్టుకుని చూస్తూ ఉండిపోతున్నారు. మరి దీనికి కారణమేంటి? అనేది నెటిజన్ల మాట. నీరవ్ మోదీ చౌక్సీ మాల్యా ఇలా చెప్పుకొంటూ.. పోతే.. ఎంతో మంది దేశాన్ని అన్ని విధాలా బురిడీ కొట్టించిన వారే. అంతేకాదు.. వీరంతా చదువుకున్న మేధావులు. బీజేపీకి ఒకప్పుడు ఆత్మ బంధువులు. మరీ ముఖ్యంగా దేశంలో పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నవారికి సన్నిహిత సంబంధాలు ఉన్నవారే. అయినప్పటికీ.. ఇలాంలటి వారు ఈడీ ఐటీ సీబీఐలకు కనిపించరు. కేవలం తెలుగు రాష్ట్రాలపైనే వీరి దృష్టి ఉంటుంది. .. ఇదీ.. భారత్ అభివృద్ధి పథంలో కీలకమైలు రాయి అనుకోవచ్చా!! అనేది నెటిజన్ల మాట.  

దీనిపై మీదగ్గర ఎలాంటి సమాచారం ఉన్నా.. కామెంట్ రూపంలో పంపండి!!
× RELATED పవన్... పక్కా లోకల్... ?
×