హ్యాష్ - సాషా లతో డాక్టర్ ను సందర్శించిన సామ్..!

సౌత్ స్టార్ హీరోయిన్ సమంత తన భర్త అక్కినేని నాగచైతన్య తో విడిపోయిన సంగతి తెలిసిందే. 2017లో ప్రేమ వివాహం చేసుకున్న చై-సామ్.. పరస్పర అంగీకారంతో నాలుగేళ్ళ వైవాహిక బంధానికి స్వస్తి పలికారు. వీరి విడాకుల వ్యవహారం మీద అనేక రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే సమంత అవేమీ పట్టించుకోకుండా ఈ కష్టకాలం నుంచి త్వరగా బయటకు రావాలని నిర్ణయించుకుందని తెలుస్తోంది. బుధవారం సామ్ తన పెట్ డాగ్స్ తో కలిసి వెటర్నరీ క్లినిక్ లో కనిపించింది.

సమంత తన పెంపుడు కుక్కలు హాష్ మరియు సాషా లకు హెల్త్ చెకప్ చేయించడానికి పశువైద్యుడిని కలిశారని తెలుస్తోంది. వెటర్నరీ క్లినిక్ లో సామ్ తన పెంపుడు జంతువులతో ఉన్న ఫొటో ఇప్పుడు వైరల్ గా మారింది. ఎందుకంటే విడాకుల ప్రకటన తర్వాత సామ్ పబ్లిక్ గా కనిపించడం ఇదే మొదటిసారి. సమంత మాస్క్ పెట్టుకొని  వైట్ టాప్ లో సింపుల్ గా ఉంది.

సమంత జంతు ప్రేమికురాలనే సంగతి తెలిసిందే. నాగచైతన్య ను వివాహం చేసుకున్న తర్వాత హ్యాష్ అనే డాగ్ ని ఇంటికి తెచ్చుకుంది. చైతూ తో దూరంగా ఉంటున్న సమయంలో ఆమె మరొక డాగ్ ని తెచ్చుకొని 'సాషా' అని పేరు పెట్టింది. ప్రస్తుతం సామ్ ఈ రెండు కుక్కపిల్లలకు సంరక్షణ చూసుకుంటోంది. ప్రస్తుతం ఆమె ఎదుర్కొంటున్న ఒత్తిడి నుండి హ్యాష్ మరియు సాషా లను చూసుకోవడం ద్వారా ఉపశమనం పొందుతోందని అర్థం అవుతోంది.

ఇకపోతే ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న 'ఎవరు మీలో కోటీశ్వరులు' షో లో సమంత ససెలబ్రిటీ గెస్టుగా హాజరయ్యారు. దీనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఎపిసోడ్ దసరా కానుకగా టెలికాస్ట్ కానుంది. మరోవైపు 'శకుంతలం' డబ్బింగ్ చెప్పడం ప్రారంభించింది. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా పౌరాణిక చిత్రంలో సామ్ టైటిల్ రోల్ ప్లే చేస్తోంది.
× RELATED మెగా వెబ్ సైట్ ని లాంచ్ చేసిన మెగా పవర్ స్టార్!
×