షాకింగ్: బీజేపీ అభ్యర్థికి ఒక్కటంటే ఒక్క ఓటేనా?

దేశంలో ఇప్పుడు అప్రతిహతంగా దూసుకుపోతున్న పార్టీ బీజేపీ. అధికార బలంతో ఈజీగా ప్రతి ఎన్నికల్లోనూ గెలిచేస్తోంది. ఏడేళ్లుగా ప్రతిపక్ష కాంగ్రెస్ ను తుత్తునియలు చేస్తూ దేశాన్ని ఏలుతోంది. బీజేపీ బలం ముందు ఇండియాలో ఏ పార్టీ కూడా నిలవలేకపోతోంది. 2014-19 మధ్య ఎన్ని తప్పులు చేసినా బీజేపీకే ప్రజలు మరోసారి అధికారం కట్టబెట్టారు. అలాంటి పార్టీ నుంచి ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థికి కేవలం ఒకే ఒక్క వచ్చిందంటే నమ్మశక్యంగా లేకున్నా ఇది నిజం.

బీజేపీ అభ్యర్థి పోటీచేస్తే ఒక్కటంటే ఒక్క ఓటు మాత్రమే వచ్చింది. ఆ చోద్యం తమిళనాడులో జరిగింది. తమిళనాడులో బీజేపీ బలం అంతంతమాత్రమే. ఐదేళ్ల కిందట జయలలిత మరణానంతరం అధికార అన్నాడీఎంకేను గుప్పెట్లో పెట్టుకొని బలం పెంచుకోవడానికి బీజేపీ ఎన్నో ప్రయత్నాలు చేసింది. కానీ ఏం చేసినా కమలం పార్టీ బలపడలేదు. అతి కష్టం మీద 4 సీట్లు సాధించింది. ప్రస్తుత స్థానిక ఎన్నికల్లో ఆ పార్టీకి ఒక స్థానంలో దారుణమైన అనుభవం ఎదురైంది.

కోయంబత్తూరు జిల్లాలోని పెరియనాయకన్ పాలెంలో వార్డు మెంబర్ గా బీజేపీ తరుఫున పోటీచేసిన కార్తీక్ కు కేవలం ఒక్కటంటే ఒక్క ఓటు మాత్రమే పడింది. బహుశా అభ్యర్థి కార్తీక్ మాత్రమే తన ఓటు తనకే వేసుకోవచ్చు.కార్తీక్ కుటుంబంలో ఇంకో నలుగురు ఓటర్లు ఉండగా.. ఆ నలుగురు కూడా కార్తీక్ కు ఓటు వేయకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం.

ఏ స్థాయి ఎన్నికైన జాతీయ పార్టీ నుంచి పోటీచేస్తే కాసిన్ని ఓట్లు పడుతాయి. కానీ తమిళనాట మాత్రం ఒక అభ్యర్థికి ఒక్క ఓటు పడడం ఇప్పుడు షాకింగ్ గా మారింది.
× RELATED మధులిక.. వెన్నంటే ఉంటూ.. మరణంలోనూ భర్త వెంటే..
×