నాలుగు రోజులుగా ఆర్యన్ నో ఫుడ్.. నో బాత్ రూమ్

ఎంత గొప్పగా బతికినా కూడా ప్రముఖులు జైలుకు వెళ్లిన సమయంలో అక్కడి అపరిశుబ్రమైన బాత్ రూమ్ ను వినియోగించాల్సిందే.. అందరితో పాటు జైలు అధికారులు పెట్టే ఫుడ్ ను తినాల్సిందే. మహా మహులు జైలుకు వెళ్లిన సమయంలో వారికి ఆ పరిస్థితి తప్పలేదు. కాని ఇప్పుడు ఆర్యన్ మాత్రం అక్కడి ఫుడ్ ను తినడం లేదు.. అక్కడి బాత్ రూమ్ ను కూడా వినియోగించేందుకు ఆసక్తి చూపడం లేదు. ఈ విషయం జైలు అధికారులు అనధికారికంగా చెబుతున్నారు. ఇప్పటి వరకు ఆర్యన్ ఒక్కసారి కూడా అక్కడ భోజనం చేయలేదట. అడిగిన ప్రతి సారి కూడా తనకు ఆకలిగా లేదు అంటూ దాట వేస్తున్నాడట. ఈ విషయం జైలు అధికారులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్లడం జరిగింది.

క్యాంటీన్ లో ఉన్న బిస్కట్స్ మాత్రమే తింటూ నాలుగు రోజులుగా కడుపు నింపుకుంటున్నాడు. ఇంటి నుండి తీసుకు వెళ్లిన వాటర్ బాటిల్ లో నీటిని కొద్ది కొద్దిగా తాగుతూ ఉన్నాడు. ఇక బాత్ రూమ్ కు వెళ్లేందుకు అస్సలు ఇష్టపడటం లేదు. నాలుగు రోజుల్లో ఒక్కసారి కూడా ఆర్యన్ స్నానం చేయలేదు. కనీసం కాళ్ల కృత్యాలు కూడా తీర్చుకోలేదు అంటూ సమాచారం అందుతోంది. మొత్తానికి ఆర్యన్ జైలు అధికారులకు ఇబ్బంది కలిగిస్తున్నాడు. అతడి ఆరోగ్య పరిస్థితిపై ఇప్పటికే అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అతడి వద్దకు కుటుం సభ్యులను పంపించి అయినా అతడిని కాస్త ఒప్పించాలని భావిస్తున్నారు.

ఒక వేళ మరీ మొండిగా వ్యవహరించి తినకుంటే మాత్రం ఆసుపత్రికి తీసుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. షారుఖ్ ఖాన్ ఇప్పటి వరకు ఈ విషయమై మాట్లాడేందుకు ఆసక్తి చూపించలేదు. పైగా షారుఖ్ ఖాన్ కుటుంబ సభ్యులు ఆర్యన్ ను చూసేందుకు వెళ్లినట్లుగా కూడా లేదు అంటూ బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. నాలుగు రోజులుగా జైల్లో భోజనం చేయకుండా బాత్ రూమ్ కు వెళ్లకుండా ఉన్న ఆర్యన్ ఉన్నాడు. నేడు ఆర్యన్ బెయిల్ పిటీషన్ పై విచారణ జరుగుతోంది. ఇప్పటికే ఆర్యన్ బెయిల్ పిటీషన్ ను కోర్టు తిరష్కరించింది. అయినా మళ్లీ కూడా బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ సమయంలో ఏం జరుగుతుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
× RELATED మెగా వెబ్ సైట్ ని లాంచ్ చేసిన మెగా పవర్ స్టార్!
×