బుట్టబొమ్మ బర్త్ డే ని మరింత స్పెషల్ గా మార్చేశారు..!

బుట్టబొమ్మ పుజా హెగ్డే ఎంత బిజీగా ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అమ్మడి కెరీర్ ఇప్పుడు మూడు ఇండస్ట్రీలు.. ఎనిమిది సినిమాలు అన్నట్లు కొనసాగుతోంది. తెలుగు తమిళ హిందీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది. బుధవారం (అక్టోబర్ 13) పూజా పుట్టినరోజు కావడంతో అభిమానులు సినీ ప్రముఖుల విషెస్ తో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ జరిగుతున్నాయి. కెరీర్ పీక్ స్టేజిలో ఉన్నప్పుడు వచ్చిన బర్త్ డే కావడంతో అమ్మడు నటిస్తున్న సినిమాల నుంచి స్పెషల్ పోస్టర్స్ రిలీజ్ చేసి ఈరోజుని మరింత స్పెషల్ గా మార్చారు.

బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ అక్కినేని హీరోగా రూపొందిన ''మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'' చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. ఇందులో విభా అనే మోడ్రన్ గర్ల్ పాత్రలో ఈ బ్యూటీ కనిపించనుంది. దసరా కానుకగా అక్టోబర్ 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. పూజా బర్త్ డే - రిలీజ్ డేట్ కలిసి రావడంతో జీఏ2 పిక్చర్స్ టీమ్ ఓ పోస్టర్ ని వదిలారు. స్టాండ్ అప్ కమెడియన్ గా పూజా లుక్ ఆకట్టుకుంటోంది.

అలానే 'ఆచార్య' చిత్ర బృందం కూడా పుజా హెగ్డే కు శుభాకాంక్షలు తెలిపింది. ఇందులో చిరంజీవి కి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా.. రామ్ చరణ్ సరసన పూజా హీరోయిన్ గా కనిపించనుంది. ఆమె పోషిస్తున్న నీలాంబరి లుక్ ను రిలీజ్ చేస్తూ చరణ్ బర్త్ డే విషెస్ అందించారు. అంతకముందు 'రాధే శ్యామ్' టీమ్ కూడా ఈ బ్యూటీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. డార్లింగ్ ప్రభాస్ స్వయంగా తన హ్యండిల్ నుంచి ఓ పోస్టర్ ని వదిలి విషెస్ చెప్పారు. హ్యాపీ బర్త్ డే ప్రేరణ అంటూ విడుదల చేసిన పూజా హెగ్డే స్టిల్ ఆకట్టుకుంటోంది. ఇలా తెలుగులో ఆమె నటిస్తున్న మూడు సినిమాల పోస్టర్స్ నెట్టింట హల్ చల్ చేశాయి.

ఇకపోతే తెలుగులో మరో రెండు ప్రాజెక్ట్స్ కు పూజా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మహేష్ బాబు - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో రానున్న సినిమా మరియ పవన్ కళ్యాణ్ 'భవదీయుడు భగత్ సింగ్' సినిమాల్లో పూజా హెగ్డే హీరోయిన్ గా సెలెక్ట్ అయింది. ఇక తమిళ్ లో విజయ్ సరసన 'బీస్ట్' సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది. అలానే హిందీల 'సర్కస్' తో పాటుగా మరో రెండు చిత్రాల్లో నటిస్తోంది. భాషతో సంబంధం లేకుండా టాలీవుడ్ టూ బాలీవుడ్ వయా కోలీవుడ్ అన్నట్లుగా పూజాహెగ్డే కెరీర్ పరుగులు పెడుతోంది.
× RELATED ఏమాత్రం వెనక్కి తగ్గని 'మా' ఎన్నికల అధికారి..!
×