ఏపీ థియేటర్లలో ఇకపై నాలుగు షోలు..!

కరోనా వైరస్ ప్రభావం వల్ల మూతబడిన థియేటర్స్ అన్నీ ఇప్పుడు తెరుచుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ రాష్ట్రాల్లో ఇప్పటికే సినిమా హాళ్లు ఓపెన్ అవడంతో కొత్త సినిమాల విడుదలలు ఊపందుకున్నాయి. అయితే తెలంగాణ లో 100 శాతం సీటింగ్ ఆక్యుపెన్సీ తో సినిమాకలు ప్రదర్శిస్తున్నా.. ఏపీలో మాత్రం ఇంకా 50 శాతం ఆక్యుపెన్సీతో సినిమాలు నడుస్తున్నాయి. అలానే కరోనా పరిస్థితుల నేపథ్యంలో విధించిన కర్ఫ్యూ వలన మూడు షోలకు మాత్రమే అనుమతి ఉంది. అయితే ఇప్పుడు టాలీవుడ్ నిర్మాతలకు థియేటర్ యాజమాన్యాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కర్ఫ్యూ నిబంధనలు సడలిస్తూ జీవో జారీ చేసింది. రేపు గురువారం (అక్టోబర్ 14) నుంచి అక్టోబర్ 31 వరకు అర్థరాత్రి 12 గంటల నుంచి ఉదయం 5 గం. వరకు కర్ఫ్యూ విధిస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో సినిమా థియేటర్లలో నాలుగు షో లు ప్రదర్శించుకోడానికి అవకాశం లభించినట్లు అయింది. ఇప్పటి వరకు మూడు షో లు మాత్రమే నడుస్తుండగా.. రేపటి నుంచి సెకండ్ షో కు కూడా వీలు కలిగింది. ఇది దసరా సందర్భంగా రిలీజ్ అయ్యే సినిమాలకు లాభం చేకూర్చనుంది. రేపు 'మహా సముద్రం' విడుదల అవుతుండగా.. శుక్రవారం 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' 'పెళ్లి సందD' సినిమాలు వస్తున్నాయి. ఈ మూడు చిత్రాలు ఏపీ థియేటర్లలో ఎప్పటిలాగే న్నాలుగు షో లలో ప్రదర్శించబడతాయి.

ఇకపోతే 100 శాతం థియేటర్ ఆక్యుపెన్సీ పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఇటీవల విడుదలైన చిత్రాలన్నీ 50 శాతం ఆక్యుపెన్సీ.. మూడు షో లతో నడిచాయి. ఈ నేపథ్యంలో ఇటీవల టాలీవుడ్ పెద్దలు ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరిపారు. వంద శాతం ఆక్యుపెన్సీతో పాటుగా టికెట్ రేట్ల పెంపు పై ఈ మీటింగ్ లో డిస్కష్ చేశారు. మరి దీనిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి త్వరలోనే జీవో జారీ చేస్తుందేమో చూడాలి.
× RELATED డ్రెస్సింగ్ పై కామెంట్స్ చేసిన కోట పై ఫైర్ అయిన యాంకర్ అనసూయ
×