వకీల్ సాబ్ కలెక్షన్లపై మంత్రి పేర్ని నాని హాట్ కామెంట్స్

జనసేనాని పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ చిత్రం కలెక్షన్లపై ఏపీ మంత్రి పేర్ని నాని హాట్ కామెంట్స్ చేశారు. ఈ చిత్రం నిర్మాత దిల్ రాజ్ పై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈరోజు తాడేపల్లిలో మాట్లాడిన ఏపీ మంత్రి పేర్ని నాని.. 'వకీల్ సాబ్ సినిమా బెనిఫిట్ షోలు ఎందుకు రద్దు చేశారంటూ ప్రశ్నించిన పవన్ కు కౌంటర్ ఇచ్చారు.

వకీల్ సాబ్ సినిమా ఆపేశారని పవన్ కళ్యాణ్ చెబుతున్నారని.. వకీల్ సాబ్ చిత్రంపై నిర్మాత దిల్ రాజు రెడ్డి గారికి తెలుగు రాష్ట్రాల్లో రూ.80 కోట్ల షేర్ వచ్చిందని మంత్రి పేర్ని నాని చెప్పుకొచ్చారు. అందులో ఏపీ వాటా రూ.55.60 కోట్లు అయితే.. తెలంగాణలో వచ్చింది కేవలం రూ.25.37 కోట్లు అని మంత్రి పేర్ని నాని వివరించారు. 'ఎందుకు పవన్ తప్పుడు మాటలు మాట్లాడుతావ్.. ఒక్కరోజన్నా దిల్ రాజు రెడ్డి గారిని టీకి పిలిచి నాకు ఎంత ఇచ్చావ్ ? నీకు ఎంతయ్యింది? నీకు ఎంతొచ్చింది అని అడిగితే లెక్క చెబుతాడు కదా.? వకీల్ సాబ్ ను సీఎం జగన్ అడ్డుకుంటే ఇన్ని కోట్ల షేర్ ఎలా వచ్చింది? అని మంత్రి పేర్ని నాని మండిపడ్డారు.

దిల్ రాజు గారు మీరు రెడ్లు అని నాకు తెలియదని మంత్రి పేర్ని నాని చెప్పుకొచ్చాడు. మీరు రాజులే అనుకున్నానని వివరించారు. మా జగన్ కూడా మీరు రాజులే అనుకొని మిమ్మల్ని బాగా ఏడిపిస్తున్నట్టున్నారు.. నువ్వు రెడ్డి అని చెప్పవయ్యా నీకు ఫేవర్ గా ఉంటాడు.. అంటూ మా వాడు రిపబ్లిక్ సినీ వేడుకలో అంటుంటే బాధేసిందని మంత్రి పేర్ని నాని ఎద్దేవా చేశారు.  మా పవన్ ఈ వ్యాఖ్యలు చేస్తుంటే దిల్ రాజు ముఖం ఏడవలేక నవ్వుతున్నట్టుంది.. ఆయన బాధలు ఆయనవి అంటూ పేర్ని నాని నిప్పులు చెరిగారు.

సినిమా టికెట్లు నిబంధనల సంగతేందో కానీ.. ఈ పవన్ వల్ల ఇప్పుడు నిర్మాత దిల్ రాజు ఇబ్బందులు పడుతున్నాడని.. ఆయన ముఖం చూస్తే ఆముధం తాగినట్టుగా అనిపించిందని మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. నిర్మాతలు బాగానే ఉన్నారని.. ఈయనకేంటి నొప్పి అని విమర్శించారు.
× RELATED విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. వ్యతిరేకించిన కేంద్ర మంత్రి.. ఇది నిజంగా సంచలనమే
×