ఆ మాట మాట్లాడి.. పవన్ అడ్డంగా బుక్ అయ్యారా?

వరుస పెట్టి వాయించేసిన జనసేన అధినేత.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాటలు ఇప్పుడు చర్చనీయాంశాలుగా మారాయి. మొత్తానికి మీడియాకు క్లాస్ పీకుతూనే.. భారీగా పని పెట్టిన ఆయన మాటలపై ఇప్పుడు పెద్ద ఎత్తున విశ్లేషణలు సాగుతున్నాయి. ఆయన ఒక్క స్పీచ్ పలు వర్గాల వారిని టార్గెట్ చేయటంతో పాటు.. రిటార్టు ఇచ్చేందుకు.. కౌంటర్ పంచ్ లు వేసేందుకు అవకాశాన్ని కల్పించిందన్న మాట వినిపిస్తోంది.

ముఖ్యంగా.. థియేటర్ టికెట్లను అమ్మే విషయంలో.. ఇది ప్రభుత్వ ఆలోచన కాదని.. చిరంజీవి.. దిల్ రాజు నుంచి వచ్చిన ఐడియానే అన్న మాటను ఏపీ మంత్రి పేర్ని నాని నోటి నుంచి గతంలో వచ్చింది. ఒకవేళ అదే నిజమైతే.. పవన్ కల్యాణ్ అడ్డంగా బుక్ అయినట్లేనన్న మాట వినిపిస్తోంది. చిరుతో పాటు తెలుగు సినిమా రంగానికి చెందిన కొందరు పెద్దలంతా కలిసి ఏపీ సీఎంను కలిసే ప్రయత్నం చేయటం.. ఆ సందర్భంగా ఆయన అపాయింట్ మెంట్ దొరక్కపోవటం.. మంత్రి నానితో భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా చిరుతో వెళ్లిన టీంకు.. ఏపీ ప్రభుత్వానికి మధ్య ఏదో కాస్తంత ప్యాచప్ జరిగినట్లుగా వార్తలు వస్తున్నాయి. థియేటర్లను ఓపెన్ చేసే అంశంతో పాటు.. టికెట్ల అమ్మకాలకు సంబంధించి అక్టోబరు ఒకటి నుంచి కీలక నిర్ణయాన్ని ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి.ఇలాంటివేళ.. అవేమీ పట్టని పవర్ స్టార్.. అభిమానులు రెచ్చిపోయే కొద్దీ మరింతగా చెలరేగిపోయారు. తీవ్రమైన విమర్శలు.. ఆరోపణలు చేశారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. టాలీవుడ్ ప్రముఖులతో భేటీ తర్వాత ఏపీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. ఆన్ లైన్ లో లికెట్ల అమ్మకానికి సంబంధించిన ప్రపోజల్ చిరు.. దిల్ రాజుల నుంచి వచ్చిందన్న మాటను చెప్పారు. అప్పటి నుంచి వీరిద్దరూ సైలెంట్ గా ఉన్నారే తప్పించి.. మంత్రి చెప్పిన దాన్లో తప్పులు ఉంటే.. అప్పుడే ముందుకు రావాల్సి ఉంది. అంతేకాదు.. పవన్ మాట్లాడిన దాన్లో విషయం తక్కువగ ఉందంటున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఈ ఎపిసోడ్ కు సంబంధించిన కొందరు మౌనంగా ఉంటున్నారు.

రెండు రోజులు గడిచిన తరవాత దీనిమీద మాట్లాడటం ఖాయమని చెబుతున్నారు. అదేజరిగితే.. పవన్ తప్పులో కాలు వేయటమే కాదు.. సినిమా ఇండస్ట్రీని సూప్ లో పడేశారని చెప్పక తప్పదు. మరి.. ఈ విషయం మీద క్లారిటీ రావాలంటే అయితే చిరు కానీ.. లేదంటే దిల్ రాజు కానీ.. ఇటీవల తాడేపల్లిలో జరిగిన మంత్రితో మీటింగ్ కు వెళ్లిన వారిలో ఎవరో ఒకరు పెదవి విప్పితేనే అసలు విషయాలు బయకు వస్తాయంటున్నారు. టికెట్ల విషయంలో పవన్ తొందరపడ్డారన్న మాట వినిపిస్తోంది. రానున్న రోజుల్లో ఆయన చేసింది తప్పా? ఒప్పా? అన్నది తేలనుందన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.
× RELATED కారుణ్య నియామకాలపై జగన్ సంచలన నిర్ణయం
×