మంత్రి అనిల్ భారీ పంచ్: ‘పవన్.. సంపూర్ణేశ్ ఇద్దరూ ఒక్కటే మాకు’

వైసీపీ నేతలపై పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడిన వైనం తెలిసిందే. దీనిపై ఇప్పటికే పలువురు నేతలు స్పందిస్తున్నారు. తాజాగా ఏపీ మంత్రి.. ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉన్న అనిల్ కుమార్ రియాక్టు అయ్యారు. పవన్ వ్యాఖ్యలపై ఘాటుగా రియాక్టు అయిన ఆయన.. కౌంటర్ ఎటాక్ చేశారు. పవన్.. సంపూర్ణేశ్ బాబులు ఇద్దరు తమకు ఒకటేనని తేల్చిన ఆయన.. కొత్త చర్చకు తెర తీశారు. ప్రభుత్వానికి పెద్ద హీరో అయినా.. చిన్న హీరో అయినా ఒక్కటేనని పేర్కొన్న ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారంగా మారాయి. ఈ మొత్తం ఎపిసోడ్ లో ట్విస్టు ఏమంటే.. మంత్రి అనిల్ వ్యాఖ్యలను ఎలా అర్థం చేసుకున్నారో కానీ.. సంపూర్ణేశ్ బాబు సైతం స్పందించారు. తనను.. పవన్ కల్యాణ్ తో సమానంగా చూడటం మంత్రి అనిల్ పెద్ద మనసుకు నిదర్శనమంటూ వ్యాఖ్యానించారు.

ఏ సమస్య వచ్చినా పెద్ద మనసుతో స్పందించే తెలుగు సినిమా పరిశ్రమ ఇప్పుడు కష్టాల్లో ఉంది. ముఖ్యంగా ఎగ్జిబిటర్లు బాధల్లో ఉన్నారు. అదే పెద్ద మనసుతో అవి పరిష్కారం అయ్యేలా చూడగలరంటూ సంపూర్ణేశ్ బాబు ట్వీట్ చేశారు. పవన్ పై మంత్రి అనిల్ పంచ్ ల్ని చూస్తే..

-  పవన్ కల్యాణ్ కోసం మేము ఇండస్ట్రీని భయపెట్టాలా? ఇదంతా ఏంటి? అసలు ఆయనకు ఎన్ని సీట్లు వచ్చాయి? అదేమంటే 'ఒకటితో మొదలు పెట్టాం' అంటారు. మొన్న జరిగిన పరిషత్ ఎన్నికల్లోనూ వారు ఒక మండలంలో గెలిచారు. ఇలా ఒక్కో అడుగు వేసుకుంటూ వెళ్లే సరికి పార్టీ చాప చుట్టేస్తుంది.

-  నిర్మాణాత్మక విమర్శలు తీసుకోవడానికి మేం సిద్ధం. ఈ విధానమైతే సరికాదు. ఇలాంటి వాళ్లను ప్రభుత్వం చాలా మందిని చూసింది. సోషల్మీడియాలో వాళ్లకు అభిమానులు ఉంటారు. వాళ్లు ట్రోలింగ్ చేయడం మొదలు పెడతారు. మా గురించి ఎన్ని ట్రోల్స్ చేస్తారో మీ ఇష్టం. ఎందుకంటే మమ్మల్ని తలుచుకుంటున్నందుకు ధన్యవాదాలు.

-  కేవలం ఆయనను దృష్టిలో పెట్టుకుని సినిమా పరిశ్రమను ఎందుకు ఇబ్బంది పెడతాం? అసలు ఆయనెవరు? ఆయన వాదనల్లో పొంతన లేదు. మాకు డబ్బులు కావాలంటే టికెట్ రేట్లు పెంచుతాం కదా! కానీ అలా చేయడం లేదు. సినిమా థియేటర్లు ఏమైనా మూసేశామా?

-  రేట్లు పెంచి అమ్మే టికెట్లపై ట్యాక్స్ ఎక్కడికి పోతోంది? ఈ ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి ఆన్లైన్ టికెటింగ్పై నిర్ణయం తీసుకున్నారు. దానిలో తప్పేముంది? అదే రూ.200 పెట్టి పోర్టల్లో టికెట్లు అమ్మడం ప్రతిదీ పారదర్శకంగా జరగాలనుకోవడం తప్పు ఎలా అవుతుంది?

-  టికెట్ రేటు అనేది పెద్దవాడికి ఒకలా.. చిన్నవాడికి మరోలా ఉండకూడదు. ఇద్దరికీ సమానం ఉండాలి. నాకు ఎక్కువ మంది అభిమానులు ఉన్నారు కాబట్టి రూ.100 టికెట్ ను రూ.200 పెట్టి కొనండని ఎవరైనా చెబుతారా? అలాంటి దాన్ని అభిమానాన్ని క్యాష్ చేసుకోవడం అంటారు.

-  ప్రభుత్వానికి ఏ హీరో సినిమా అయినా ఒకటే. మేమంతా కళామతల్లి ముద్దు బిడ్డలమని మీరే చెబుతారు. అలాంటప్పుడు పవన్కల్యాణ్ అయినా.. సంపూర్ణేశ్బాబు అయినా మాకు ఒకటే. హీరోగా ఇద్దరి కష్టం ఒకటే!

-  సిక్స్ ప్యాక్ చేసేందుకు సుధీర్బాబు.. ప్రభాస్ ఇద్దరూ ఒకేలా కష్టపడ్డారు. టికెట్ రేటు అనేది పెద్దవాడికి ఒకలా.. చిన్నవాడికి మరోలా ఉండకూడదు. ఇద్దరికీ సమానం ఉండాలి.
× RELATED విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. వ్యతిరేకించిన కేంద్ర మంత్రి.. ఇది నిజంగా సంచలనమే
×