వైరల్ వీడియో: వర్షం పడితే హైదరాబాద్ రోడ్ల మీద నడవొద్దా?

చాలా చిన్న వీడియో. కానీ.. ఈ వీడియో చూసిన తర్వాత చాలానే ఆలోచనలు ముసురుకుంటాయి. మిగిలిన వాళ్ల సంగతి ఎలా ఉన్నా.. హైదరాబాద్ లో ఉన్న వారు మాత్రం.. క్షణకాలం పాటు ఆలోచనలో పడిపోవటం ఖాయం. వర్షం వేళలో బయటకు వెళ్లటం మామూలే. కానీ.. వర్షం తీవ్రత ఎక్కువగా ఉన్న వేళలో..రోడ్డ మీద నడిస్తే ఎంత డేంజర్ అన్న విషయం తాజాగా వైరల్ అవుతున్న వీడియోను చూస్తే ఇట్టే అర్థమైపోతుంది.

శనివారం రాత్రి ఉన్నట్లుండి మొదలైన వర్షం.. చూస్తుండగానే పెరిగి పెద్దది కావటమే కాదు.. చాలా ప్రాంతాల్లోని ప్రజలకు చుక్కల్నిచూపించింది. లోతట్టు ప్రాంతాల్లోని వర్షపునీరు చేరటం.. పాత ఇళ్లు కూలిపోవటం.. రోడ్ల మీద పెద్ద ఎత్తున నిలిచిన నీళ్లతో వాహనదారులకు చుక్కలు కనిపిస్తే.. రోజు వెళ్లే దారే అయినా.. ఏమవుతుందన్న భయాందోళనలకు గురయ్యేలా చేసింది పాడు వర్షం.

రోజువారీగా వెళ్లే దారి అన్న ధీమాతో..జోరున వర్షం పడుతున్న వేళ.. ఇంటికి దగ్గరకు వచ్చిన ఒక ఐటీ ఇంజనీర్ అన్యాయంగా డ్రైనేజీ గుంతలోకి పడిపోయిన వైనం షాకింగ్ గా మారింది. తన ఇంటికి కేవలం యాభై మీటర్ల దూరంలో ఉన్న ఇంటికి చేరుకునే వేళలో.. ఆయన వేసిన ఒక తప్పటడుగు ఆయన్ను ఈడ్చుకెళ్లిపోయింది మాయదారి వాన. మణికొండ నివాసి అయిన గోపిశెట్టి రజనీకాంత్ ఒక ఐటీ కంపెనీలో పని చేస్తుంటారు. షాద్ నగర్ లోని నోవా గ్రీన్ కంపెనీలో పని చేస్తున్న ఆయన.. శనివారం రాత్రి తొమ్మిది గంటల వేళలో ఇంటి నుంచి బయటకు వచ్చాడు.

వర్షం అప్పటికే భారీగా పడుతున్న వేళ.. రోడ్డు మీద మొత్తం నీళ్లతో నిండిపోయింది. దీంతో.. నిర్మాణంలో ఉన్న డ్రైనేజీ గుంతలో జారి పడిన అతను.. క్షణంలో మాయమయ్యాడు. వర్షపు నీటితో రోడ్డు ప్రాంతం మొత్తం నిండిపోవటంతో.. డ్రైనేజీ గుంతను గుర్తించటంలో జరిగిన పొరపాటు.. ఆయన అడ్రస్ గల్లంతు అయ్యేలా చేసింది. దీంతో రంగంలోకి దిగిన రెండు డీఆర్ఎఫ్ టీంలు అతడి కోసం గాలిస్తున్నాయి. నాలాలు కలిసే చోట.. నెక్నాంపూర్ చెరువు వద్ద చెక్ చేస్తున్నారు. ఈ వీడియో చూసిన తర్వాత హైదరాబాద్ లో వర్షపు వేళ.. రోడ్ల మీద భారీగా వాన నీరు చేరుకుంటే.. అడుగు ముందుకు వేయటం ఎంత ప్రమాదకరమన్న విషయం  చెప్పేస్తుందని చెప్పాలి.

 

× RELATED కారుణ్య నియామకాలపై జగన్ సంచలన నిర్ణయం
×