స్టన్నర్ లుక్ తో 2.0 బ్యూటీ రీలోడెడ్

స్టార్ ఫిలిం మేకర్ శంకర్ తెరకెక్కించిన `2.0` చిత్రం తర్వాత బ్రిటన్ బ్యూటీ అమీజాక్సన్ సినిమాలకు దూరమైన సంగతి తెలిసిందే. కెరీర్ ఆరంభంలోనే టాప్ క్లాస్ డైరెక్టర్ల చిత్రాల్లో భాగమైంది. ఏ. ఎల్ విజయ్..శంకర్... అట్లీ లాంటి దర్శకులతో పనిచేసి నటిగా ఆరితేరింది. కానీ కెరీర్ మాత్రం బిల్డ్ చేసుకోలేకపోయింది. భారీ బడ్జెట్ చిత్రాల్లో నటించే అవకాశం దక్కినా అమీ సక్సెస్ కాలేకపోయింది. ఇక బాలీవుడ్ లోనూ అదే పరిస్థితి. తెలుగులో మెగా వపర్ స్టార్ రామ్ చరణ్ సరసన `ఎవడు`లో నటించింది. కానీ ఇక్కడా నిలదొక్కుకోలేకపోయింది. అటుపై విదేశీయుడితో డేటింగ్  లో మునిగి తేలి..చివరికి పెళ్లి కాకుండానే ఓ  బిడ్డకు జన్మనిచ్చింది. అటుపై భారీతీయ ఫిలిం మేకర్స్ అమీ వైపు చూసింది లేదు.

ప్రస్తుతం లండన్ లో తన భర్త జార్జి.. కుమారునితో నివాసం ఉంటోంది. సోషల్ మీడియాలో అభిమానులకు టచ్ లో ఉండటం తప్ప..అమీ ప్రోఫెషనల్ గా చేసేదేమీ  కనిపించలేదు. అయితే కొన్ని ఆంగ్ల ప్రకటనల్లో నటిస్తూ ఎమీ ఆర్జిస్తోంది. తాజాగా ఓ కొత్త ఫోటో షూట్ లో పాల్గొని మంటలు రేపింది. ఓ డిజైనర్ లుక్ లో అమీ తళుక్కున మెరిసింది.  నారిజం రంగు కోట్...మ్యాచింగ్  హ్యాండ్ బ్యాగుతో సపోర్టింగ్ స్టూడియో వాల్ పై ఓరగా వాలి ఫోటో సెషన్ లో పాల్గొంది. ప్రస్తుతం ఈ ఫోటో ఇన్ స్టాలో వైరల్ గా మారింది. లండన్ కిక్ స్టార్ట్ అంటూ అమీ  ఓ కామెంట్ కూడా పోస్ట్ చేసింది. అంటే అమ్మడు కెరీర్ ఇకపై ఇక్కడే అనుకునేలా ఓ చిన్న హింట్ ఇచ్చింది. అమీజాక్సన్ బేసిక్ గా బ్రిటన్ కి చెందిన పాపులర్ మోడల్ కం నటి.

మిస్ టీన్ వరల్డ్ గాను నిలిచింది. అమీ సినిమా కెరీర్ తొలుత హాలీవుడ్ లోనే ప్రారంభమైంది. వార్నర్ బ్రదర్స్ నిర్మించిన `సూపర్ గాళ్` కామిక్  చిత్రంలో నటించింది. అటుపై అక్కడా అవకాశాలు రాకపోవడంతో నేరుగా కోలీవుడ్ లో అడుగు పెట్టింది. ఇక్కడ `మదరాసు పట్టణం` సినిమాతో లాంచ్ అయింది. ఈ చిత్రానికి ఏ. ఎల్ విజయ్ దర్శకత్వం వహించారు. ఆ తర్వాత అదే దర్శకుడు పనిచేసిన  `తాండవం` సినిమాలో నటించింది.   ఆ తర్వాత శంకర్ కాంపౌండ్ లోకి అడుగు పెట్టింది. అక్కడ ఎన్నో పోటీల్లో పాల్గొంది. అమెరికన్ వెబ్ సిరీస్ లలో నటించేందుకు ఇంతకుముందు సంతకాలు చేసింది. అయితే ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఏవీ లేవు. తదుపరి సూపర్ గాళ్ తరహా పాత్రతో మెప్పిస్తుందని భావించినా దానికి సంబంధించిన అప్ డేట్ లేదు.

చిట్టికన్నయ్య 2.0 ఎదిగేస్తున్నాడు!

ఏడాదిన్నర క్రితమే అమీ జాక్సన్ బేబి బంప్ సందడి సోషల్ మీడియాలో అంతా ఇంతా కాదు. నెలలు నిండే క్రమంలో నిరంతరం ఎమీ తన అనుభవాల్ని అనుభూతుల్ని అభిమానులతో పంచుకుంది. ఎట్టకేలకు చిట్టికన్నయ్య 2.0 అరైవ్ అయ్యాక ఇక ఆ ఆనందాన్ని కూడా ఏమాత్రం దాచుకోలేదు. నిరంతర ఫోటోషూట్లతో ఒకటే అంతర్జాలాన్ని హీటెక్కించేస్తోంది.

బేబి బోయ్ కి ఆండ్రియాస్ అని నామకరణం చేసింది మొదలు తనతో ఇప్పటికే లెక్కకు మిక్కిలి ఫోటోషూట్లలో పాల్గొంది అమీజాక్సన్. కాబోయే భర్త జార్జ్ పనాయోటౌ ..మాస్టర్ ఆండ్రియాస్ తో కలిసి అమీజాక్సన్ దేశ విదేశాల్లో విహారయాత్రలకు వెళ్లిన ఫోటోలు అంతర్జాలంలో వైరల్ అయ్యాయి.  అద్భుతమైన ఫోటోల తో తరచూ ట్రెండ్ చేసే ఎమీ జాక్సన్  ఇన్ స్టాగ్రామ్ లో తాజాగా మరికొన్ని చక్కని ఫోటోల్ని జోడించింది. కాబోయే భర్త జార్జ్ పనాయోటౌ వారి ఏడాది పుత్రరత్నం ఆండ్రియాస్ తో కలిసి లండన్ లో హ్యాపీ లైఫ్ ని పూర్తిస్థాయిలో ఆనందిస్తున్నారు. జార్జ్ పనాయోటౌ -అమీ జంట ఇప్పటికే నిశ్చితార్థం చేసుకున్నారు.  ఎంగేజ్ మెంట్ పార్టీని నిర్వహించారు. వారు తమ కుమారుడికి ఆండ్రియాస్ ను సెప్టెంబర్ లో జన్మనిచ్చారు. అప్పుడే కిడ్ బుడిబుడి నడకలతో సందడి చేసేయడం చర్చకు వచ్చింది.
× RELATED యువ క్రియేటర్ ని పొగిడేసిన జక్కన్న-తారక్
×