లోకం కళ్లన్నీ జూ.అతిలోక సుందరిపైనే ఎందుకంటే?

నటవారసురాలు జాన్వీ కపూర్ తన వర్కౌట్ సెషన్ ను అమితంగా ఇష్టపడుతోంది. ఎలాంటి బిజీ షెడ్యూల్ లో వున్నా సరే వర్కవుట్స్ కు మాత్రం నో బ్రేక్. క్రమం తప్పకుండా కసరత్తులు చేయాల్సిందే. అతిలోక సుందరి వారసురాలిగా ఎంట్రీ ఇచ్చినా నటిగా మాత్రం తనదైన మార్కుని చూపించాలని ప్రయత్నిస్తోంది. వీలున్న ప్రతి వేదికపైనా అందాల ప్రదర్శనకు కూడా వెనకాడనని జాన్వీ నిరూపిస్తోంది. ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఆమె తరచు ఇన్ స్టా వేదిగా షేర్ చేస్తున్న ఫొటో షూట్ లే.

గ్లామర్ తో పాటు నటనకు ప్రధాన్యత వున్న పాత్రలలో నటించడానికే ప్రధాన్యతనిస్తున్న జాన్వీ తన ఫిట్ నెస్ ని కాపాడుకోవడం కోసం నిత్యం జిమ్ కు యోగా సెషన్స్ కు వెళుతూ తరచూ మీడియా కంట పడుతోంది. ఇటీవల తన చెల్లెలు ఖుషీ కపూర్ .. అండ్ ఫ్రెండ్స్ తో కలిసి ఓ పబ్ లో ఎంజాయ్ చేసి జాన్వీ అందుకు సంబంధించిన ఫొటోలని ఓ ఫ్రెండ్ తో చనువుగా వున్న వీడియోని ఇన్ స్టా వేదిగా అబిమానులతో పంచుకుంది.

తాజాగా ఆమె జిమ్ సెషన్ కు సంబంధించిన ఫొటోలు నెట్టింట సందడి చేస్తున్నాయి. ముంబై బాంద్రాలోని ఓ జిమ్ లో వర్కవుట్స్ సెషన్ పూర్తి చేసి బయటికి వచ్చిన జాన్వీ కెమెరాకు చిక్కింది. బ్లాక్ షార్ట్ .. బ్లాక్ టాప్ ధరించి హాట్ గా కనిపిస్తున్న జాన్వీని చూడగానే కెమెరాలకు మీడియా పని చెప్పేసింది. కోవిడ్ 19 ప్రోటోకాల్ ను పాటిస్తూ మాస్క్ ధరించి జాన్వీ జిమ్ కు హాజరైన దృశ్యాలు ఆమె ఫ్యాన్స్ కన్నార్పకుండా చేస్తున్నాయి. ప్రస్తుతం జాన్వీ `దోస్తానా  2`.. `గుడ్ లక్ జెర్రీ` చిత్రాలలో నటిస్తోంది.
× RELATED యువ క్రియేటర్ ని పొగిడేసిన జక్కన్న-తారక్
×