పెళ్లయినా వన్నె తగ్గని చందమామ

అందాల చందమామ కాజల్ అగర్వాల్ తన స్నేహితుడిని ప్రేమించి పెద్దల అంగీకారంతో ఇటీవలే వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. దశాబ్ద కాలానికిపై గా తెలుగు.. తమిళ భాషల్లో క్రేజీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న కాజల్ అగర్వాల్ పెళ్లైనా అదే హవాని కొనసాగిస్తోంది. పెళ్లి తరువాత మాల్దీవ్స్ లో హనీమూన్ కోసం భారీ స్థాయిలోనే ఖర్చు చేసి వార్తల్లో నిలిచింది.

ప్రస్తుతం కాజల్ చేతిలో మొత్తం ఎనిమిది చిత్రాలున్నాయి. మంచు విష్ణుతో చేసిన `మోసగాళ్లు` బాక్సాఫీస్ వద్ద అడ్రస్ లేకుండా పోయింది. అయినా కాజల్ కు ఆఫర్లకు కొదవ లేదు. పెళ్లికి ముందు అంగీకరించిన చిత్రాల లిస్ట్ భారీగానే వుంది. మెగాస్టార్ చిరంజీవితో `ఆచార్య` లోకనాయకుడు వెర్సటైల్ హీరో కమల్ హాసన్.. శంకర్ ల `ఇండియన్ 2`.. ది ఘోస్ట్ .. డ్యాన్స్ మాస్టర్ బృంద దర్శకురాలిగా పరిచయం అవుతున్న రూపొందిస్తున్న `హే సినామిక`తో పాటు పలు తమిళ చిత్రాల్లో నటిస్తోంది.

ఇందులో ఆచార్య.. ఇండియన్ 2 ది ఘోస్ట్ చిత్రాలు మినహా అన్ని పూర్తయ్యాయి. శంకర్ `ఇండియన్ 2` ఆర్టిక లావాదేవీలు.. మేకర్స్ ..శంకర్ మధ్య ఏర్పడిన అభిప్రాయ భేధాల కారణంగా ఈ మూవీ షూటింగ్ ఆలస్యమవుతూ వస్తోంది. ఇదిలా వుంటే పెళ్లి తరువాత కూడా కాజల్ అదే గ్లామర్ తో కవర్ పేజీలకు ప్రత్యేకంగా ఫొటోలకు పోజులిస్తోంది. గులాబీ వర్ణం ఫ్రాక్ లో థై షో చేస్తూ కాజల్ `ఫాబ్ లుక్ మ్యాగజైన్ కవర్ పేజీ కోసం చేసి ఫొటోషూట్ నెట్టింట సందడి చేస్తోంది. పింక్ కలర్ డ్రెస్ లో హాట్ గా కనిపిస్తున్న కాజల్ ని చూసిన వారంతా పెళ్లైనా వన్నె తగ్గని చందమామ అంటూ కామెంట్ లు చేస్తున్నారు.
× RELATED డ్రెస్సింగ్ పై కామెంట్స్ చేసిన కోట పై ఫైర్ అయిన యాంకర్ అనసూయ
×