ఈ స్పెషల్ పరికిణీ బుట్టబొమ్మ కోసమే అన్నట్టుగా

ముంబై బ్యూటీ పూజాహెగ్డే  టాలీవుడ్ కెరీర్ ఊహించని విధంగా బెస్ట్ ఫేజ్ కి మలుపు తిరిగిన సంగతి తెలిసిందే. `అలవైకుంఠపురములో` రికార్డ్ బ్రేకింగ్ హిట్ తో అమ్మడికి మరిన్ని భారీ అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఆ క్రేజ్ తో పారితోషికంలోనూ పూజా డిమాండ్ పీక్స్ కి చేరింది. ప్రస్తుతం  టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లోనూ సినిమాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో భారీగా పారితోషికం అందుకుంటోంది. నయనతార తర్వాత పారితోషికంలో చుక్కలు చూపిస్తోన్న భామగా పూజా  ఖ్యాతి కెక్కింది. ఇటీవలే బీస్ట్ షూటింగ్ కోసం పూజా కోసం ఏకంగా ఓ ప్రయివేట్ చార్టర్ నే బుక్ చేయాల్సి వచ్చిందంటే అర్థం చేసుకోవాలి. వెంట బాడీ గార్స్డ్....వ్యక్తిగత సిబ్బంది ఇలా పూజా సినిమా కు కేటాయించిన డేట్లలో ఆన్ సె ట్స్ కు వెళ్లాలంటే పారితోషికంతో పాటు..అదనంగాను నిర్మాతకు కొంత ఖర్చు తప్పదు.

ఈ వ్యవహారంపై కొంత మంది టాలీవుడ్ కోలీవుడ్ నిర్మాతలు అసహాన్ని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. డిమాండ్ ఉన్నప్పుడు దండుకోవాలి అన్న నానుడిని పూజ తూచ తప్పకుండా పాటిస్తున్నట్లే కనిపిస్తోంది. ఆ సంగతి పక్కకనబెడిత ఇన్ స్టాలో తను ఎంత యాక్టివ్ గా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. ఎప్పటికప్పుడు కొత్త ఫోటోలతో హీటెక్కించడం పూజా ప్రత్యేకత. ఆన్ స్క్రీన్ మాత్రమే కాదు..ఆఫ్ ది స్క్రీన్ లోనూ చెలరేగిపోతుంది. తాజాగా పూజా హెగ్డే  స్టన్నింగ్ లుక్ ఒకటి వైరల్ గా మారింది. టాప్ లో జాకెట్... బాటమ్ ని కవర్ చేస్తూ పసుపు వర్ణంతో కూడిన పరికిణీని ధరించింది. ప్రస్తుతం ఈ ఫోటో ఇన్ స్టాలో వైరల్ గా మారింది. ఈ లుక్ ని  ఉద్దేశించి ఫాలోవర్స్ ఆసక్తికర కామెంట్లు గుప్పిస్తున్నారు. ఈ స్పెషల్ పరికిణీ బుట్టబొమ్మ కోసమే అన్నట్టుగా ఉంఇ అంటూ పొగిడేస్తున్నారు కొందరు తెలుగు అభిమానులు.

ప్రస్తుతం పూజా హెగ్దే పాన్ ఇండియా చిత్రం `రాధేశ్యామ్` లో నటిస్తోంది. అలాగే యంగ్ హీరో అఖిల్ సరసన `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్` లోనూ నటిస్తోంది. ఈ చిత్రం రిలీజ్ కు రెడీగా ఉంది. మరోవైపు సూపర్ స్టార్ మహేష్ -మాయావి త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న చిత్రంలో హీరోయిన్ గా పూజా హెగ్డే ఎంపికైంది. గతంలో పూజా హెగ్డే `మహర్షి`లో మహేష్ కి జోడీగా నటించిన సంగతి తెలిసిందే. మరోవైపు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సరసన బీస్ట్ చిత్రంలోనూ నటిస్తూ బిజీగా ఉంది. 
× RELATED డ్రెస్సింగ్ పై కామెంట్స్ చేసిన కోట పై ఫైర్ అయిన యాంకర్ అనసూయ
×