'ఎక్కేసిందే' ప్రోమో: అనూప్ రూబెన్స్ కంపోజ్ చేసిన హుషారైన సాంగ్..!

'ఏక్ మినీ కథ' ఫేమ్ సంతోష్ శోభన్ - మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా హీరోహీరోయిన్లుగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ''మంచి రోజులు వచ్చాయి''. వాస్తవ సంఘటన ఆధారంగా రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందుతోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ - క్యారక్టర్స్ ఇంట్రో వీడియో మంచి స్పందన తెచ్చుకున్నాయి. అలానే సిద్ శ్రీరామ్ ఆలపించిన 'సో సోగా' అనే సాంగ్ కూడా శ్రోతలను విశేషంగా అలరిస్తోంది. ఈ నేపథ్యంలో ''ఎక్కేసిందే'' అనే పాట లిరికల్ వీడియోని రిలీజ్ చేయడానికి చిత్ర బృందం రెడీ అయింది.

ఈ క్రమంలో తాజాగా 'ఎక్కేసిందే' పాటకు సంబంధించిన ప్రోమోని మేకర్స్ సోషల్ మీడియాలో వదిలారు. ''చుట్టూ చుట్టూ చుట్టూ.. నిన్ను చుట్టుకుంటానే.. కట్టు కట్టు కట్టు.. ఒట్టు ఒట్టు నిన్ను కట్టుకుంటానే.. ఎక్కేసింది ఎక్కేసింది ఎక్కేసింది'' అంటూ సాగిన ఈ పాట అలరిస్తోంది. ఈ హుషారైన గీతానికి అనూప్ రూబెన్స్ ట్యూన్ కంపోజ్ చేశారు. అంతే హుషారుగా చౌరస్తా రామ్ మిరియాల దీన్ని ఆలపించారు. లిరిసిస్ట్ అనంత్ శ్రీరామ్ ఈ పాటకు సాహిత్యం అందించారు.

'ఎక్కేసిందే' పాటలో సంతోష్ శోభన్ - మెహ్రీన్ కౌర్ వేసిన ఎనర్జిటిక్ స్టెప్స్ ఆకట్టుకుంటున్నాయి. ఫుల్ సాంగ్ ని సెప్టెంబర్ 23న విడుదల చేయనున్నారు. 'మంచి రోజులు వచ్చాయి' సినిమా యూవీ కాన్సెప్ట్స్ మరియు మాస్ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై రూపొందుతోంది. వి సెల్యులాయిడ్ మరియు SKN సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి రామ్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు.

'మంచి రోజులు వచ్చాయి' చిత్రంలో అజయ్ ఘోష్ - వెన్నెల కిషోర్ - శ్రీనివాస్ రెడ్డి - ప్రవీణ్ - సప్తగిరి - సుదర్శన్ - వైవా హర్ష - సత్యం రాజేష్ - శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని వీలయినంత త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురాడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

× RELATED యువ క్రియేటర్ ని పొగిడేసిన జక్కన్న-తారక్
×