ఫొటోటాక్ : 'మల్లీశ్వరి' ఇంకా ప్రిన్సెస్ లాగే ఉంది

వెంకటేష్ హీరోగా వచ్చిన మల్లీశ్వరి సినిమా వచ్చి 17 ఏళ్లు కావస్తుంది. ఆ సినిమాలో హీరోయిన్ గా కత్రీనా కైఫ్ నటించిన విషయం తెల్సిందే. ఆ సినిమాలో కత్రీనా కైఫ్ ఎలా అయితే అందంగా కత్తిలా ఉందో ఇప్పటికి అదే అందంతో కనిపిస్తుంది. ఆమె వయసు పెరుగుతున్న సమయంలో అందం కూడా పెరుగుతుంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. మొత్తానికి మల్లీశ్వరి సినిమా లో ఎలా అయితే ఉందో అలాగే ఇప్పటికి ఉందంటూ తెలుగు అభిమానులు మరియు ప్రేక్షకులు వావ్ అనే విధంగా తాజా లుక్ లో కత్రీనా కైఫ్ కనిపించింది. ఇటీవల ఈ అమ్మడు ఎయిర్ పోర్ట్ లో ఇలా కనిపించింది. మల్లీశ్వరిలో ప్రిన్సెస్ గా కనిపించిన కత్రీనా ఇప్పటికి కూడా అలాగే ఉందంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

బాలీవుడ్ లో సుదీర్ఘ కాలంగా స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న కత్రీనా కైఫ్ ఇప్పటికి కూడా స్టార్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ అనడంలో సందేహం లేదు. దేశ వ్యాప్తంగా అభిమానులను కలిగి ఉన్న ఆమె ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో పాటు బుల్లి తెర షో లపై కనిపించింది. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే సినిమాలతో పాటు అందరిని మెప్పించే ఐటెం సాంగ్స్ ను ఈమె చేసింది. నాలుగు పదుల వయసుకు ఆమె చేరువ అయ్యింది. అయినా కూడా పాతికేళ్ల ముద్దుగుమ్మ మాదిరిగానే యంగ్ హీరోలకు కుర్ర కారుకు మోస్ట్ బ్యూటీపుల్ గా కనిపిస్తుంది. ముద్దుగుమ్మ మరో పదేళ్ల వరకు కూడా ఇలాగే ఉంటుందేమో అంటూ కామెంట్స్ వస్తున్నాయి.

తాజాగా ఎయిర్ పోర్ట్ లో చాలా సింపుల్ గా ట్రెండీ గా కనిపించేలా కత్రీనా ఈ కాస్ట్యూమ్స్ లో ఆకట్టుకుంది. స్టైలిష్ గాగుల్స్ తో పాటు హెయిర్ స్టైల్ సింపుల్ గా ఉండటంతో కత్రీనా ఎప్పటిలాగే మరింత అందంగా కనిపిస్తుంది. కత్రీనా కైఫ్ స్టైలిష్ లుక్ కు అంతా కూడా ఫిదా అవుతున్నారు. ఈ అమ్మడు ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తున్న విషయం తెల్సిందే. తెలుగు లో మళ్లీ ఈ అమ్మడి రీ ఎంట్రీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి వారి కోరిక ఎప్పటికి నెరవేరేనో చూడాలి.


× RELATED 'లవ్ స్టోరీ' మీదనే ఇండస్ట్రీ ఆశలన్నీ..!
×