స్లీవ్ లెస్ ఫ్రాక్ లో రాశీ ప్లెజెంట్ లుక్ వైరల్

హిందీ మూవీ `మద్రాస్ కేఫ్`తో కెరీర్ ని ప్రారంభించింది రాశీ ఖన్నా. జాన్ అబ్రహం సినిమాతో ఎంట్రీ ఇచ్చినా ఇప్పటికీ ఆశించిన స్థాయి గుర్తింపు లభించలేదు. `మనం` సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చినా రాశి హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకుల ముందుకొంచ్చింది మాత్రం `ఊహలు గుసగుసలాడే` చిత్రంతో. జోరు మూవీతో టాలీవుడ్ లో తన జోరు చూపించాలనుకున్నా కుదరలేదు. తర్వాత గోపీచంద్ `జిల్`లో గ్లామర్ షోతో జిగేల్మనిపించేసింది.

స్టార్ హీరోల సరసన నటించి క్రేజీ హీరోయిన్ గా పేరు తెచ్చుకోవాలని ప్రయత్నించినా యువహీరోలే తనకు ఏకైక ఆప్షన్ గా మారారు. అనిల్ రావిపూడితో చేసిన `సుప్రీమ్` సినిమా రాశీకి మంచి పేరుని తెచ్చిపెట్టింది. బెల్లం శ్రీదేవిగా గ్లామర్ని మాత్రమే కాదు కామెడీని కూడా పండించగలనని నిరూపించుకుని నవ్వించింది. కానీ ఆ స్థాయిలో మాత్రం అవకాశాల్ని దక్కించుకోలేకపోయింది. ఎన్టీఆర్ లాంటి బిగ్ స్టార్ పక్కన `జై లవకుశ`లో నటించే అవకాశం లభించినా ఆ మూవీ మల్టీస్టారర్ కావడం తన పాత్రకు ప్రాధాన్యత లేకపోవడంతో రాశీకి పెద్దగా క్రేజ్ దక్కలేదు.

`తొలిప్రేమ`- `ప్రతి రోజు పండగే` లాంటి హిట్స్ తన ఖాతాలో వున్నా రాశీ వంక చూసిన స్టార్ హీరో లేరు. దీంతో తన దృష్టిని తమిళ ఇండస్ట్రీకి మళ్లించింది. అక్కడ వరుస చిత్రాల్లో నటిస్తూ యమ బిజీగా మారిపోయింది రాశి. తమిళ్ లో రాశీ జోరు చూసిన మన వాళ్లు మళ్లీ తెలుగులో అవకాశాలు ఇవ్వడం మొదలుపెట్టారు. గోపీచంద్ తో `పక్కా కమర్షియల్`.. నాగచైతన్యతో `థ్యాంక్యూ` చిత్రాల్లో నటిస్తోంది.

తెలుగు- తమిళ- మలయాళ భాషల్లో ఇప్పుడు రాశీ చేతిలో ఎనిమిది చిత్రాలున్నాయి. అందులో రెండు చిత్రాలు పూర్తి కాగా మరో ఆరు చిత్రాలు అండర్ ప్రొడక్షన్ లో వున్నాయి. ఎక్కడున్నా రాశీ తెలుగు ప్రేక్షకుల్ని మాత్రం మర్చిపోవడం లేదు. ఎప్పటికప్పుడు వారిని ఎంటర్ టైన్ చేయడానికి తన ఫొటోషూట్ లతో అలరిస్తూనే వుంది. తాజాగా స్లీవ్ లెస్ డ్రెస్ లో రాశీ పంచుకున్న ఫొటోలు అభిమానులతో పాటు నెటిజన్స్ని కట్టిపడేస్తున్నాయి. స్లీవ్ లెస్ గౌన్ లో తన ప్లెజెంట్ గ్లామ్ ని చూపిస్తూ రాశీ చేస్తున్న ఫొటోషూట్ లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఓరకంట చూస్తూ ఈ డ్రెస్ లో రాశీ చేస్తున్న రచ్చకు ఆమె ఫ్యాన్స్ చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే అని పాటేసుకుంటున్నారు. 
× RELATED 'లవ్ స్టోరీ' మీదనే ఇండస్ట్రీ ఆశలన్నీ..!
×