కెరీర్ సంద్రంలో కష్టాల కడలిని దాటేనా?

కొంత మందికి ఎన్ని అవకాశాలు దక్కినా అదృష్టిం కలిసిరాదు. మలయాళీ ఫ్యామిలీ నుంచి వచ్చిన అనూ పరిస్థితి అదే. అమెరికా- చికాగోలో పుట్టి అక్కడే పౌరసత్వం పొందిన అను ఇమ్మాన్యుయేల్ ఇప్పటికీ టాలీవుడ్ లో బిగ్ కెరీర్ గురించి పాకులాడుతూనే ఉంది. తండ్రి తంకాచెన్ నిర్మించిన మలయాళ చిత్రం `స్వప్న సంచారి` చిత్రంతో చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన అను ఇమ్మానుయేల్ ఆ తరువాత నివీన్ పాలీ నటించిన `యాక్షన్ హీరో బీజు`తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చేసింది. తొలి సినిమా హిట్ కావడంతో ఆమెపై మన టాలీవుడ్ డైరెక్టర్ కన్ను పడింది.

ఇంకేముందు నేచురల్ స్టార్ నాని నటించిన `మజ్ను` సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైంది. దీంతో మలయాళీ ఇండస్ట్రీని పక్కన పెట్టేసి ఇక్కడే స్థిపరడాలని ప్రయత్నాలు మొదలుపెట్టింది. రాజ్ తరుణ్ తో `కిట్టు వున్నాడు జాగ్రత్త`... తమిళంలో విశాల్- మిస్కన్ల చిత్రం `తుప్పారి వాలన్` చిత్రాల్లో నటించింది. ఈ రెండూ సూపర్ హిట్ కావడంతో పెద్ద హీరోల చిత్రాల్లో నటించే ఛాన్స్ కొట్టేసింది.

అయితే గోపీచంద్ తో చేసిన ఆక్సిజన్- పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో చేసిన `అజ్ఞాతవాసి`... అల్లు అర్జున్ తో చేసిన `నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా` చైతో చేసిన `శైలజారెడ్డి అల్లుడు` బెల్లంకొండ శ్రీనివాస్తో చేసిన `అల్లుడు అదుర్స్` ఏ మాత్రం బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోయాయి. ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద బోర్లాపడ్డాయి. పెద్ద హీరోలతో కలిసి నటించే అవకాశం దక్కినా అవి ఫ్లాప్ లుగా నిలవడంతో అనుకి అవకాశాలు తగ్గాయి. కెరీర్ ప్రశ్నార్థకంలో పడిపోయింది.

ఇదే సమయంలో అమెని వెతుక్కుంటూ వచ్చిన అవకాశం `మహా సముద్రం`. `ఆర్ఎక్స్ 100` ఫేమ్ అజయ్ భూపతి చేస్తున్న మల్టీ స్టారర్ కావడం.. ఇందులో హీరో శర్వానంద్ తో కలిసి చాలా కాలం తరువాత సిద్ధార్ధ్ తెలుగులో రీ ఎంట్రీ ఇస్తుండటంతో ఈ మూవీపై అంచనాలు నెలకొన్నాయి. అనుకి తోడు ఇందులో అదితీరావు హైదరీ కూడా హీరోయిన్గా నటిస్తోంది. ద్విభాషా చిత్రంగా రూపొందుతున్న ఈ మూవీ అనుని కెరీర్ కష్టాల `మహాసముద్రం` దాటిస్తుందా? అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ మూవీతో తన క్రేజ్ని పెంచుకోవడానికి తాజాగా అను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన హాట్ హాట్ ఫొటోలు ఆకట్టుకుంటున్నాయి. ఆరెంజ్ కలర్ గౌన్ లో యెద ఎత్తులని చూపిస్తూ కుర్రకారుని హృదయాల్ని చిత్తు చేస్తోంది. థై షో చేస్తూ వైట్ డ్రెస్ లో అను చేస్తున్న హంగామా మతిపోగొడుతోంది.  

కుర్రహీరోతో ప్రేమాయణం నిజమా?

ఇటీవల అనూ ఇమ్మాన్యుయేల్ టాలీవుడ్ కి చెందిన ఓ యువహీరోతో ప్రేమలో ఉందని ప్రచారమైంది. ఈ ప్రచారానికి తోడు ఫీలింగ్ బ్లూ! అంటూ తన మనసులో గాయాన్ని మొన్నటికి మొన్న బయటపెట్టే ప్రయత్నం చేయడంతో అందరూ డౌట్ పడ్డారు.

ఒకవేళ అనూ ప్రేమలో పడిందా?  ప్రేమలో ఉంటే ఆ విషయాన్ని ఎందుకని దాస్తోంది? అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. అన్నట్టు సహజీవనం నేపథ్యంలో అనూ `ప్రేమ కాదంట` అనే మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో అల్లు శిరీష్ కథానాయకుడు. ఇటీవల రిలీజ్ చేసిన రొమాంటిక్ లుక్ కి స్పందన బావుంది. అన్నట్టు అనూ ఫీలింగ్ బ్లూ అనగానే ..ఏమైంది అంటూ వెంటపడుతున్నారు ఫ్యాన్స్! మరి వాళ్లందరికీ ఏమని సమాధానమిస్తుందో ఏమిటో...! ఇంతకీ అనూ ప్రేమాయణం నిజమేనా?
× RELATED 'లవ్ స్టోరీ' మీదనే ఇండస్ట్రీ ఆశలన్నీ..!
×