మాల్దీవుల్లో స్టార్ డాటర్ బికినీ మంటలు

అందాల నటవారసురాలు సారా అలీఖాన్ మాల్దీవుల్లో తన సెలవుల్లో ఉత్తమ సమయాన్ని గడుపుతున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల సారా ఇన్ లో వరుస ఫోటోషూట్లను షేర్ చేస్తోంది. తాజాగా మరోసారి కెమెరా కోసం పోజులిచ్చి ఆమె కొన్ని హాట్ ఫోటోలు హీటెక్కించాయి. రొమాంటిక్ మేని ఛాయని తన టోన్డ్ స్కిన్ అందాలని బీచ్ ఎండలో ఆరబోసింది ఈ బ్యూటీ. కొబ్బరి చెట్టు నుంచి ఊయలలో వేలాడుతూ అందాల విందుకు సై అంటూ ఫోజులిచ్చింది. మరొక ఫోటోలో సూర్యాస్తమయం సమయంలో ఆమె యోగా సెషన్ చేస్తూ కనిపించింది.

సారా హాట్ ఆరెంజ్ అండ్ పింక్ కలర్ బికినీ లో మెరిసింది. ఇంతకీ విశేషం ఏంటంటే పింక్ మరియు ఆరెంజ్ బికినీలో దర్శనిమిచ్చిన సారా బాటమ్లో వేసుకున్న డ్రెస్ ఖరీదు రూ .4900. ఆమె గుండె ఆకారంలో ఉన్న నల్లటి సన్ గ్లాసెస్ .. ఫెదర్ చెవిపోగులతో కనిపించింది. మేకప్ లేకుండా ఆమె జుట్టును వదులుగా సహజంగా ఉంచింది. ఆమె పోస్ట్ కి క్యాప్షన్ ని కూడా ఇచ్చింది. మీరు హృదయం నుండి మాత్రమే ఆకాశాన్ని తాకగలరు #సూర్యాస్తమయం #శాంతి #ప్రేమ #సంతోషం` అని క్యాప్షన్ ఇచ్చింది.

సారా అలీ ఖాన్ ప్రస్తుతం అక్షయ్ కుమార్- ధనుష్ లతో కలిసి రొమాంటిక్ డ్రామా `అట్రాంగిరే`లో నటిస్తోంది. ఆనంద్ ఎల్. రాయ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో రవితేజ హీరోయిన్ `ఖిలాడీ` ఫేమ్ డింపుల్ హయాతీ కూడా నటిస్తోంది. టీ సిరీస్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.


× RELATED `లవ్ స్టోరి` ప్రీరిలీజ్ బిజినెస్ ఆ రేంజులో`
×