ఆరోజు నమ్మలేదు కానీ.. సోదరిపై నాని నమ్మకం ఇప్పుడు పదింతలైంది!

స్టార్ హీరోల బంధుమిత్రులు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడం సహజం. కొంత మంది నటీనటులుగా ఎంట్రీ ఇస్తుంటే.. మరి కొంత మంది డైరెక్టర్ లుగా రాణిస్తున్నారు. రకరకాల విభాగాల్లో సత్తా చాటేందుకు ప్రయత్నించడం చూస్తున్నదే. అయితే వీరి టాలెంట్ ని ముందు స్టార్స్ ఏ మాత్రం పట్టించుకోని సందర్భాలు చాలానే వున్నాయి. సూపర్ స్టార్ మహేష్ సోదరి మంజుల డైరెక్షన్ చేస్తానంటే ముందు మహేష్ పెద్దగా పట్టించుకోలేదట.

ఆ తరువాత ఏం జరిగిందో తెలిసిందే. ఇదిలా వుంటే నేచురల్ స్టార్ నాని సోదరి దీప్తి కూడా మంజుల తరహాలోనే తాను డైరెక్టర్ ని అవుతానని చెప్పి షాకిచ్చిందట. ఆమె మాటల్ని ఆమె రెడీ చేసిన స్క్రిప్ట్ ని నాని ఏమాత్రం పట్టించుకోలేదట. ఆ తరువాత స్క్రిప్ట్ నచ్చిడంతో `మీట్ క్యూట్` అనే పేరుతో సినిమాని ఇటీవలే పట్టాలెక్కించారు. సత్యరాజ్- రుహానీ శర్మ- వర్ష బొల్లమ్మ- అదా శర్మ- సునైనా- సంచిత తదితరులు ఇందులో ముఖ్య పాత్రల్ని పోషిస్తున్నారు. అప్పుడే ఈ మూవీ చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. ఓ ప్రముఖ ఓటీటీ ద్వారా రిలీజ్ చేయబోతున్నారని తెలుస్తోంది.

ఈ స్క్రిప్ట్ తెరపైకి రావడం వెనక పెద్ద కథే వుందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో హీరో నాని చెప్పుకొచ్చారు. `మా అక్క నాకు ఫ్యాన్. అయితే ఇండస్ట్రీలోకి రావాలన్న ఆలోచన తనకు ఎప్పుడూ లేదని కానీ రైటింగ్ అంటే తనకు చాలా ఇష్టమన్నారు. అప్పుడప్పుడు తన ఆలోచనలని పేపర్ మీద పెడుతుంటుంది. అలా రాసినవి నాకు పంపిస్తుంటుంది. ఒక రోజు నాకు ఫోన్ చేసి ఒక స్క్రిప్ట్ రాయాలనుకుంటున్నానని చెప్పింది. ఇందుకు ఏం చేయాలంది. అయితే ఆన్ లైన్ లో హాలీవుడ్ స్క్రిప్ట్స్ వుంటాయని వాటిని చూడు అవగాహన వస్తుందని చెప్పా. అలా కొన్ని స్క్రిప్ట్ లు చూసి అవగాహనతో ఒక అంథాలజీ స్క్రిప్ట్ రాసింది. అది చదివి ఎలా వుందో చెప్పమని నాకు పంపింది. నేను పెద్దగా పట్టించుకోలేదు. మనం మన ఇంట్లో అక్కల్ని చెల్లెల్ని తమ్ముళ్లని తక్కువగా అంచనా వేస్తుంటాం కదా. నేనూ అలాగే లైట్ తీసుకున్నా. కానీ ఒక రోజు మా కజిన్స్ ఫోన్ చేసి స్క్రిప్ట్ అదిరిపోయింది చదివావా? అన్నారు. వాళ్లు చెప్పగానే స్క్రిప్ట్ చదివా. గొప్పగా కథ రాసినట్టనిపించింది. వెంటనే తనకు ఫోన్ చేసి అదే విషయాన్ని చెప్పా. స్క్రిప్ట్ ని నన్నే వాడుకోమంది. కానీ దీన్ని నువ్వే చేయచాలని చెప్పా. కానీ అది తన వల్ల కాదంది. దీంతో మంచి టీమ్ ని సెట్ చేసి సినిమా తీయమని చెప్పా. `మీట్ క్యూట్` విడుదలయ్యాక తనకు చాలా ఆఫర్లు వస్తాయి` అని నాని చెప్పుకొచ్చారు.
× RELATED `లవ్ స్టోరి` ప్రీరిలీజ్ బిజినెస్ ఆ రేంజులో`
×